CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన

CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన

పాఠశాల విద్యాలో రెండు రకాల పాఠశాలను ఉంటాయి. అవి సెకండరీ స్కూలింగ్ సర్టిఫికేట్ (SSC), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్(CBSE). సిలబస్, పాఠాలు చెప్పే విధానం ఈ రెండిట్లో వేరుగా ఉంటుంది. ఎక్కువ మంది పేరెంట్స్ తమ పిల్లల్ని  CBSE స్కూల్స్ లో చదివించడానికి ఇష్టపడుతుంటారు. ఫస్ట్ క్లాస్ చదవడానికి CBSE స్కూల్ 6 సంవత్సరాలు వయసు ఉండాలని నూతన విద్యా విధానం 2020 ప్రకారం సవరించింది. ఈ నిబంధన పట్ల తల్లిదండ్రుల అసంహనం వ్యక్తం చేస్తున్నారని తిరుపతి రెడ్డి కమిటీ వెల్లడించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాల విద్యా  విధానం గురించి తిరుపతి రెడ్డి కమిటీ అధ్యాయనం చేసింది. ఈ కమిటీ నివేదికలో  సీబీఎస్ఈ స్కూల్స్ 10 నుంచి 30 శాతం స్కూల్ ఫీజులు పెంచినట్లు దీని వల్ల తల్లిదండ్రుల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. 

Also Read:సినీ పోలిస్ ఎండీగా దేవాంగ్ సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

అలాగే SSCలో ఫస్ట్ క్లాస్ చదవాలంటే పిల్లాడికి 5 సంవత్సరాల ఉండాలి. కానీ ప్రస్తుతం CBSE స్కూల్ లో  1వ తరగతి చదవాలంటే కచ్చితంగా ఆరు సంవత్సరాలు ఉండాలని రూల్ పెట్టింది.  దీన్ని పేరెంట్స్ తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. CBSEలో ఫస్ట్ క్లాస్ చదవడాని ఇది వరకే ఆరు సంవత్సరాలుగా ఉండేదని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయం సీబీఎసీలో చదివే పిల్లలు నష్టపోతారని, అన్నీ స్కూల్స్ లో ఓకే రూల్ ఉండాలని హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ వారు చెబుతున్నారు.

చాలా వరకు CBSE  స్కూల్స్ నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అడ్మిషన్లు పూర్తి చేసి తర్వాత అడ్మిషన్లు తక్కువున్నాయని ఎక్కువ ఫీజులు వసూలు చూస్తున్నాయని తిరుపతి రెడ్డి కమిటీలో పేర్కొండి. అడ్మిషన్ ఫీజు ఏకంగా 10-30 పర్సెంట్ పెంచి రూ.70 నుంచి 80వేలు తీసుకుంటున్నారని ఈ నివేదికలో తెలిపింది. ఇలాంటి ఫిర్యాదులు చాలా ఉన్నా ప్రభుత్వ వాటిని పరిష్కరించడం లేదని, వాటిలో జోక్యం చేసుకోవడం లేదని ఈ కమిటీ స్పష్టం చేసింది. వీటిపై చొరపు చూపి పరిష్కరించాలని ప్రభుత్వానికి ఈ కమిటీ సూచించింది.