Hero Siddharth: సిద్దార్థ్‌‌ ‘రౌడీ మోడ్‌‌ ఆన్‌’.. ‌‘3BHK’ సక్సెస్తో వరుస సినిమాలు.. లైనప్ ఇదే

Hero Siddharth: సిద్దార్థ్‌‌ ‘రౌడీ మోడ్‌‌ ఆన్‌’.. ‌‘3BHK’ సక్సెస్తో వరుస సినిమాలు.. లైనప్ ఇదే

ఈ ఏడాది జులైలో ‘3BHK’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌‌ను ఇంప్రెస్‌‌ చేసిన సిద్దార్థ్‌‌.. తాజాగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడు. ‘రౌడీ అండ్‌‌ కో’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాషన్‌‌ స్టూడియోస్‌‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం (Nov8) ఈ మూవీ టైటిల్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.

‘రూల్స్‌‌ బ్రోకెన్, లిమిట్స్‌‌ క్రాస్డ్‌‌, మూడ్.. రౌడీ మోడ్‌‌ ఆన్‌‌..’ అంటూ టైటిల్ పోస్టర్‌‌‌‌ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. రెండేళ్ల క్రితం సిద్దార్థ్‌‌ హీరోగా ‘టక్కర్’ అనే రొమాంటిక్ యాక్షన్‌‌ సినిమా తీసిన కార్తిక్ జి క్రిష్‌‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

టైటిల్‌‌ను బట్టి ఇదికూడా యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్ అని అర్థమవుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. మరోవైపు ‘ఆపరేషన్‌‌ సఫేద్ సాగర్‌‌‌‌’ అనే వెబ్‌‌ సిరీస్‌‌లోనూ సిద్దార్థ్ నటిస్తున్నాడు. త్వరలో నెట్‌‌ ఫ్లిక్స్‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.