హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను(అన్క్లెయిమ్ ఐటమ్స్) మరోసారి వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల11, 12 తేదీల్లో జేబీఎస్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం జరుగుతుందని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (లాజిస్టిక్స్) ఇషాక్ బిన్ మహ్మద్ తెలిపారు. ఈసారి గృహోపకరణాలు, టీవీలు, మొబైల్స్ వంటి 112 రకాల వస్తువులు వేలం వేయనున్నట్లు వివరించారు.
