పంద్రాగస్టు నాటికి ఇంట‌ర్ మెమోలు

పంద్రాగస్టు నాటికి ఇంట‌ర్ మెమోలు

ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ లాంగ్ మెమోలు అందేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు ఫస్ట్ నుంచే విద్యార్థులకు మెమోలు అందిస్తామని ముందుగా ప్రకటించినా, అది సాధ్యం కాలేదు. దీంతో ఈ నెల15 వరకు అయినా విద్యార్థులకు మెమోలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో పాసైన వారితో పాటు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, పాస్ టూ ఫెయిల్ (సప్లిమెంటరీ లేకపోవడంతో) మూడు రకాల మెమోలను ఇంటర్ బోర్డుముద్రించాల్సి ఉంది. అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ ఈ మధ్యనే పూర్తయింది.

వీటితో కలిపి అన్నింటినీ ఇటీవలే ప్రింటింగ్ కు ఇచ్చినట్టుతెలిసింది. అన్ని రకాల మెమోలు సుమారు 10 లక్షల వరకూ ముద్రించాల్సి ఉంది. కరోనా ఎఫెక్ట్తో క్ట్ ఇంటర్ బోర్డు, సీజీజీ ఆఫీసులతో పాటు ప్రింటింగ్ ప్రెస్లోనూ సిబ్బంది తక్కువగా పని చేస్తున్నారు. అందుకే ప్రింటింగ్ ఆలస్య మవుతుందని తెలుస్తోంది. అయితే ప్రింటింగ్ కొనసాగుతోందనీ, ఓ వారంలో ఇంటర్ లాంగ్ మెమోలు బోర్డుకు వచ్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. వాటిని వెంటనే జిల్లాల వారిగా డీఐఈఓ ఆఫీసులకు పంపిస్తామన్నారు. ఆ ఆఫీసుల నుంచి కాలేజీ మేనేజ్మెంట్లు తీసుకువెళతాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం