స్టూడెంట్లకు సమాచారం ఇవ్వకుండానే ఇంటర్ ఆన్ లైన్ క్లాసులు షురూ 

స్టూడెంట్లకు సమాచారం ఇవ్వకుండానే ఇంటర్ ఆన్ లైన్ క్లాసులు షురూ 
  • ఇంటర్ ఫస్టియర్ ‘ఫస్ట్ డే’ క్లాస్​మిస్
  • స్టూడెంట్లకు సమాచారం ఇవ్వకుండానే ఆన్ లైన్ క్లాసులు షురూ 
  • తీరిగ్గా సాయంత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంటర్మీడియెట్ అధికారుల తీరు మారడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకొని రెండున్నర నెలల నుంచి వేచిచూస్తున్న ఫస్టియర్ స్టూడెంట్లు ఫస్ట్ డే.. క్లాసులు మిస్సయ్యారు. కనీసం ప్రిన్సిపల్స్​కూడా సమాచారం ఇవ్వకుండానే, సోమవారం ఆన్​లైన్ క్లాసులను ప్రారంభించారు. దీనిపై స్టూడెంట్లు, లెక్చరర్లు మండిపడుతున్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మే నెలాఖరులో ఇంటర్ ఫస్టడియర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సెకండియర్ స్టూడెంట్లకు జులై ఫస్ట్ నుంచి ఆన్​లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు. నెల రోజులుగా ఫస్టియర్​స్టూడెంట్లకు ఆన్​లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలని స్టూడెంట్లు, పేరెంట్లు, లెక్చరర్ల నుంచి డిమాండ్ మొదలైంది. దీనిపై ఇంటర్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఫస్టియర్​ క్లాసులు ప్రారంభమయ్యాయనీ సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంట్లో సాయంత్రం 3గంటల నుంచి ఆన్​లైన్ క్లాసులు ప్రారంభమని పేర్కొనగా,  ప్రెస్ నోట్ మాత్రం నాలుగున్నర తర్వాత పంపించడం గమనార్హం. దీంతో మెజార్టీ ఫస్టియర్ స్టూడెంట్లు ఫస్డ్ డే ఫస్ట్ క్లాస్ మిస్సయ్యారు. 

మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు క్లాసులు
ఫస్టియర్ స్టూడెంట్లకు ఈనెల 31 వరకూ ఆన్​లైన్ పాఠాల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఆరు క్లాసులు ఉంటాయని ప్రకటించారు. సోమ, మంగళ, బుధ,గురువారాల్లో మెయిన్ సబ్జెక్టులు, శుక్రవారం లాంగ్వేజెస్, శనివారం ఉర్దూ మీడియం స్టూడెంట్లకు క్లాసులుంటాయని ప్రెస్ నోట్​లో పేర్కొన్నారు.

ఫస్టియర్​లో చేరేందుకు 30వరకూ గడువు 
ఇంటర్ ఫస్టియర్​లో చేరేందుకు ఈనెల 30 వరకూ గడువు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీచేశారు. సర్కారు,ప్రైవేటు కాలేజీలతో పాటు గురుకులాలకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకూ 405 సర్కారు కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు దాటిన విషయం తెలిసిందే.