మే రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

మే రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల రెండోవారంలో ఇంటర్మీడియెట్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో వాల్యూవేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల15 నుంచి 29 వరకు ఇంటర్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ జరిగాయి. మైనర్, ఒకేషనల్, బ్రిడ్జి కోర్సుల పరీక్షలు ఈ నెల 4 వరకు నిర్వహించారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9.47 లక్షల మంది పరీక్షలు రాశారు.

గత నెల 24 నుంచి ఇంటర్ స్పాట్ వాల్యూవేషన్ కొనసాగుతోంది. హిస్టరీ, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులకు చివరి స్పెల్ వాల్యూవేషన్ ఈ నెల 9న ప్రారంభం కానున్నది. ఇప్పటికే తెలుగు, హిందీతో పాటు చిన్నచిన్న సబ్జెక్టుల వాల్యూవేషన్ పూర్తికాగా, ఈ నెల 25తో పూర్తి స్థాయి స్పాట్ ముగియనున్నది. ఓఎంఆర్ స్కానింగ్, రిజల్ట్ ప్రాసెస్​కు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మే రెండో వారంలో  రిజల్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.