హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన జశ్వంత్ హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇంట్లో వాళ్లు వచ్చి చూసే సరికి జశ్వంత్ చనిపోయాడు. జశ్వంత్ తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తల్లి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హస్పిటల్ కు తరలించారు.