హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. పెదనాన్న లైంగికంగా వేధించాడంటూ..

హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థిని  ఆత్మహత్య.. పెదనాన్న లైంగికంగా వేధించాడంటూ..

ఇటీవల కాలంలో అత్యచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు అన్న తేడా లేకుండా యువతులు, మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కామాంధులు. ఆఫీసులలో, స్కూళ్లలోని పరాయి మగాడు లైంగికంగా వేధిస్తే.. కొంతమంది తిరగబడతారు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అదే... ఇంట్లో మనుషులే లైంగిక వేధింపులకు పాల్పడితే పరిస్థితి ఏంటి.. బాధితురాలు ఎంత క్షోభ అనుభవిస్తుందో కదా.. హైదరాబాద్ లో సొంత పెదనాన్న లైంగికంగా వేధించడంతో సూసైడ్ చేసుకుంది ఇంటర్ విద్యార్థిని.హైదరాబాద్ లోని కొంపల్లిలో జరిగింది ఈ దారుణం.శుక్రవారం ( అక్టోబర్ 3 )  జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... 

సొంత పెదనాన్న లైంగిక వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  కొంపల్లిలోని పోచమ్మ గడ్డకు చెందిన 17 ఏళ్ళ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సొంత పెదనాన్న లైంగికంగా వేధించాడంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది విద్యార్థిని.

పెదనాన్న లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది విద్యార్థిని. విద్యార్థిని మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలిక మరణానికి కారణమైన ఆమె పెదనాన్నను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బంధువులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు.