
చందానగర్, వెలుగు: ‘ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దు’ అంటూ ల్యాప్‌టాప్‌లో నోట్ రాసి ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్అయ్యాడు. హైదరాబాద్ నల్లగండ్లలోని అపర్ణ సైబర్ కమ్యూన్ అపార్ట్ మెంట్ కు చెందిన శివకుమార్ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన కొడుకు ఇనేశ్(16) ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా, చదువులో వెనకబడడంతో తల్లిదండ్రులు మందలించారు.
దీంతో బుధవారం అర్ధరాత్రి కుటుంబసభ్యులు అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శివకుమార్ ఫిర్యాదుతోచందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.