మిస్సింగ్ సెట్స్ స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలు : ఇంటర్ బోర్డ్

మిస్సింగ్ సెట్స్ స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలు : ఇంటర్ బోర్డ్

ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సెట్స్ స్థానంలో  కొత్త సెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్. ఇందుకు గాను ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. వరంగల్ పోలిస్ స్టేషన్ లో ఇంటర్ మీడియట్ ప్రశ్నపత్రాలు గల బాక్స్ లను భద్రపరచగా… అందులో నుంచి..  రెండు బాక్సులు మిస్సింగ్ అయినట్లు గుర్తించామని చెప్పారు అశోక్.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఎటువంటి ఆటంకం కలగకుండా… కొత్త సెట్స్ గల ప్రశ్నాపత్రాలతో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు అశోక్. 07-06-2019 న జరిగే ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలు యధావిధిగా నిర్వహించబడతాయని చెప్పారు. విద్యార్థులు ఆందోళన చెందరాదని కొత్త సెట్స్ ప్రశ్నాపత్రాలను ఏర్పాటుచేశామని ఆయన అన్నారు.

 

inter-supplementary-question-papers-leaked-2019