బాలయ్య బర్త్ డే రోజున సప్రైజ్.. ?

బాలయ్య బర్త్ డే రోజున సప్రైజ్.. ?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించారు  బోయపాటి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు బోయపాటి. అయితే అది ఎప్పుడుటుందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో బాలయ్య అభిమానులు  అఖండ సీక్వెల్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య బర్త్ డే జూన్ 10న ఈ మూవీ సీక్వెల్ ను  అధికారికంగా లాంచ్  చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల కీరోల్ ప్లే చేస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అటు బోయపాటి హీరో రామ్ తో ఓ సినిమాని చేస్తున్నారు.   బాలకృష్ణ, బోయపాటిలు తమతమ సినిమాలు కంప్లీట్ చేసుకున్నాక అఖండ సీక్వెల్ ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది.