ఫీజు కట్టినా హాల్ టికెట్లో సబ్జెక్ట్ లేదు

ఫీజు కట్టినా హాల్ టికెట్లో సబ్జెక్ట్ లేదు

జగిత్యాల, వెలుగు: ఓ స్టూడెంట్ పరీక్ష ఫీజు కట్టినా హాల్ టికెట్ లో సబ్జెక్టులు పడకపోవడంతో ఎగ్జామ్ సెంటర్ ఆఫీసర్లు నెంబర్ లేదంటూ పంపించారు. సదరు స్టూడెంట్ గంటకు పైగా ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గర్ల్స్ కాలేజీలో 2011 సంవత్సరంలో చదివిన రాజేశ్వరి అనే స్టూడెంట్ 8 ఏళ్ల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టింది. ఆ అమ్మాయి హాల్ టికెట్ లో ఫొటో, సబ్జెక్టు పడలేదు. గురువారం పరీక్షా కేంద్రానికి వెళ్లగా అక్కడ ఆమె నెంబర్ లేక పోవడంతో ఏం చేయాలో తోచక చదివిన కాలేజీకి వెళ్లి ఆఫీసర్ల చుట్టూ తిరిగి ప్రయత్నం చేయగా చివరకు ఆఫీసర్లు స్పందించి రాజేశ్వరిని సెంటర్లోకి అనుమతించేలా చొరవ తీసుకున్నారు.