ఇంటర్లో అన్ని సబ్జెక్టులకూ ఇంటర్నల్స్! థియరీకి 80%, ఇంటర్నల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 20% మార్కులు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

ఇంటర్లో అన్ని సబ్జెక్టులకూ ఇంటర్నల్స్! థియరీకి 80%, ఇంటర్నల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 20% మార్కులు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
  • ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ప్రాక్టికల్ ఎగ్జామ్స్.. కొత్తగా ఏసీఈ కోర్సు కూడా..


హైదరాబాద్, వెలుగు: విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించి, నైపుణ్యాలను పెంచే దిశగా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలు మార్పులు చేయనున్నారు.  సీబీఎస్ఈ తరహాలోనే అన్ని సబ్జెక్టుల్లోనూ ఇంటర్నల్​ మార్కులను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇప్పటివరకు కేవలం సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండగా, ఇకపై ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు కీలక సంస్కరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో వచ్చే విద్యా సంవత్సరం  నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్​ చదువుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్ ​సబ్జెక్టులో మాత్రమే ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లో ఉంది. ఇందులో 80 మార్కులకు థియరీ కాగా, 20 మార్కులు ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌కు  కేటాయించారు. ఇకపై అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే విధానం కొనసాగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుతం సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈలో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ విధానం అమలవుతున్నది. ఇకపై తెలంగాణ ఇంటర్ బోర్డు కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన లాంగ్వేజెస్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లోనూ 80 శాతం  మార్కులు థియరీకి, 20 శాతం మార్కులు ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచి అమలు చేయనుండగా, ఇందుకు అనుగుణంగా సిలబస్‌‌‌‌‌‌‌‌లోనూ మార్పులు చేయనున్నారు. 

ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రాక్టికల్స్.. 

ప్రస్తుతం ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీసీలో 470 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు మాత్రమే థియరీ పరీక్షలు జరుగుతున్నాయి. మిగిలిన 30, 60 మార్కులకు సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఫస్టియర్ సబ్జెక్టులపై సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రాక్టికల్స్ నిర్వహించడం ఇటు విద్యార్థులకు, అటు లెక్చరర్లకు ఇబ్బందిగా మారింది.

 దీంతో ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఒక్కో సబ్జెక్టులో ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 మార్కులకు, సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో15 మార్కులకు ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. తద్వారా ప్రాక్టికల్స్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

మరో కొత్త కోర్సు.. 

ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌లో మరో కొత్త కోర్సును సర్కార్ ప్రవేశ పెట్టనున్నది. సీఈసీ తరహాలోనే ఏసీఈ గ్రూపును వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో ఈ కోర్సును విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది. అకౌంట్స్ ప్రత్యేక సబ్జెక్టుగా ఉండటంతో విద్యార్థులకు డిగ్రీలోనూ ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థుల్లో స్కిల్స్​ పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరం మధ్యలో ఉండటంతో.. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి ఈ సంస్కరణల అమలుకు ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు.