గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

నవంబర్ 20 నుంచి గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది. నవంబర్ 28 వరకు 8 రోజుల పాటు… 50వ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర సమాచార-ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, రాహుల్ రావేల్, మధుర్ భండార్కర్ లాంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కరణ్ జొహార్, సుభాష్ ఘాయ్ లాంటి వారిని కూడా స్టీరింగ్ కమిటీలో చేర్చారు. ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగస్వామి అయ్యేందుకు రష్యా కూడా ఆసక్తిగా ఉందని ప్రకాశ్ జవేదకర్ తెలిపారు. ఆస్కార్ అవార్డులిచ్చే సంస్థ ఛైర్మన్ జాన్ బెయిలీ… కూడా ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చేందుకు అంగీకరించారని జవేదకర్ చెప్పారు. అలాగే ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాట్లు, టిక్కెట్లపై చర్చించారు.