ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే

ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే

కుడి చేత్తో రోజూవారి పనులు చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, అదే పనిని ఎడమ చేత్తో చేయడం అంటే కాస్తా చాలెంజ్ తో కూడుకున్నదే. అది సడన్ గా వచ్చే అలవాటు కాదు. చిన్నతనం నుంచే కొంతమందికి అలవాటైపోతుంది. తినడం, దువ్వుకోవడం, రాయడం... ఇలా అన్ని పనులూ ఎడమ చేత్తో చేస్తూ... ప్రపంచంలోనే ముఖ్యమైన వ్యక్తుల జాబితాలో నిలుస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సైంటిస్టులు, క్రీడాకారులు, చక్రవర్తులు, తాత్వికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలుగా ఇలా పేరుగాంచిన ప్రముఖులందరూ ఎడమచేతివాటం వారే. నిజం చెప్పాలంటే ఎడమచేతి వాటం కలిగిన వాళ్లే మరింత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబడతారని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ప్రపంచ జనాభాలో 5నుంచి 10% మంది ఎడమచేతి వాటం వారు ఉన్నారట. నేడు (ఆగస్టు 13) ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే సందర్బంగా ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ల గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు...

  • అమెరికా మొత్తం జనాభాలో 30 మిలియన్ల ప్రజలు ఎడమచేతి వాటంవారే ఉండటం విశేషం.
  • కుడి చేతివాటం కలిగిన వారి కంటే ఎడమ చేతి వాటం కలిగిన వాళ్లు ఎక్కువ తెలివిగల వారై ఉంటారు. 
  • టాప్‌ టెన్నీస్‌ ప్లేయర్లలో 40 శాతం ఎడమచేతివాటం వారే.
  • ఎడమ చేతి వాటం కలవారు మల్టీ టాస్కింగ్ పనులను బాగా చేస్తారు. వారికి ఏ విషయాన్నైనా గుర్తుంచుకునే స్వభావం సాధారణ మనుషుల కంటే అధికంగా ఉంటుంది.
  • ఎడమచేతి వాటం ఉన్నవారికి మిగతా వారితో పోలిస్తే  నిద్ర లేమి, మైగ్రేన్లు లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
  • కుడి చేతి వాటం వారితో పోల్చితే ఎడమచేతివాటం వారు అలర్జీ, ఆస్తమా వ్యాధుల భారీన ఎక్కువగా పడుతుంటారు.
  • బ్రిటీష్ రాజకుటుంబంలో ఎడమ చేతివాటం కలిగిన రాణులున్నారు. క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీరంతా ఎడమచేతివాటం కలిగినవారే.
  • నెర్వస్ అండ్‌ మెంటల్‌ డిసీజ్‌ జర్నల్‌ అధ్యయనాల్లో కుడి చేతివాటం వారి కంటే ఎడమ చేతివాటం కలిగిన వారికి కోపం ఎక్కువ

ఎడమచేతి వాటం ఉన్న ప్రముఖులు 

అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, బారక్ ఒబామా, బిల్ గేట్స్, జూలియా రాబర్ట్స్, మార్క్ జుకర్‌బర్గ్, , నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మేరీ క్యూరీ, హెన్రీ ఫోర్డ్, అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, చార్లీ చాప్లిన్, ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్, కీను రీవ్స్, సిల్వెస్టర్ స్టాలోన్, డేవిడ్ బౌవీ, సెలిన్ డియోన్, రికీ మార్టిన్, ఆల్బర్ట్ ఐన్‌స్టిన్‌, నెపోలియన్ బోనపార్టే,  స్టీవ్ జాబ్స్‌తోపాటు ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎడమచేతి వాటం కలిగినవారే.