కరోనాను జయించిన 113 ఏళ్ల‌ బామ్మ

కరోనాను జయించిన 113 ఏళ్ల‌ బామ్మ

కోవిడ్‌​-19 మహమ్మారిని స్పెయిన్ ‌కు చెందిన మరియా బ్రాన్యాస్ (113) ఏళ్ల బామ్మ జయించారు. కొన్ని వారాల పాటు ఒంటరిగా ఐసోలేషన్ ‌లో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకున్నారు. దీంతో కరోనాను జయించిన అతి పెద్ద వయస్కురాలిగా మరియా బ్రాన్యాస్ నిలిచారు. అమెరికాలో జన్మించిన మరియా బ్రాన్యాస్ ఏప్రిల్‌లో వైరస్‌ బారిన పడ్డారు. గత 20 ఏళ్లుగా ఓల్ట్‌ ఏజ్‌ హోంలో ఉంటున్న ఆమెకు వ్యాధి సోకింది. దీంతో ఐసోలేషన్ ‌లో కొన్ని వారాలు ఒంటరిగా గడిపినా, మనో ధైర్యంతో నిలిచి గెలిచారు. పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.

గతంలో ఎన్నో ఉపద్రవాలను చూసి, స్పెయిన్లో ఓల్డెస్ట్‌ మహిళగా ప్రసిద్ధి చెందిన బ్రాన్యాస్ ‌తాజాగా కరోనాపై కూడా ఒంటరిగా పోరాడి, ఆరోగ్యంతో తిరిగి రావడం సంతోషంగా ఉందని బ్రాన్యాస్ కుమార్తె రోసా మోరెట్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆమెకు చికిత్స అందించిన నర్సు కూడా బ్రాన్యాస్‌ కోలుకోవడం చాలా ఆనందానిచ్చిందన్నారు. తనకు వ్యాధి నయమయ్యేలా చేసిన సిబ్బందికి మరియా కృతజ్ఞతలు తెలిపారు.