జీడీపీ గ్రోత్​ అంచనా 6.3 శాతానికి పెంపు

జీడీపీ గ్రోత్​ అంచనా 6.3 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.1 శాతం నుండి 6.3 శాతానికి పెంచింది. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన తన అక్టోబర్ 2023 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌‌లుక్ నివేదికలో పేర్కొంది.  2023-–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రిటైల్ ఇన్​ఫ్లేషన్​ 5.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 

ఆర్​బీఐ  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఇన్​ఫ్లేషన్​ను 5.4 శాతంగా అంచనా వేయగా,  జీడీపీ  వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 31న కేంద్రం విడుదల చేసిన అధికారిక డేటా ఏప్రిల్–-జూన్‌‌లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతానికి విస్తరించిందని పేర్కొంది.