యూరి సెక్టార్ లో ఇంటర్నెట్‌, మొబైల్ ఫోన్ సర్వీసు నిలిపివేత

యూరి సెక్టార్ లో ఇంటర్నెట్‌, మొబైల్ ఫోన్ సర్వీసు నిలిపివేత

జమ్ముకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో ఇంటర్నెట్‌, మొబైల్ ఫోన్ సర్వీసు తాత్కలికంగా నిలిపివేయబడ్డాయి. ఉగ్రవాదుల చొరబాట్లకు సంబంధించి వాస్తవాధీన రేఖ వెంబడిన తనిఖీలు కొనసాగుతున్నాయి. బారాముల్లా యురి సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఆర్మీ అధికారులు తెలిపారు. LOC వెంబడి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులను పట్టుకునేందుదకు ఆర్మీ బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని  అధికారులు తెలిపారు. యురి సెక్టార్‌లో ఇంటర్నెట్, ఫోన్‌ సర్వీసులను నిలిపివేయం ఇదే మొదటిసారి. యురి సెక్టార్‌పై దాడి జరిగి సెప్టెంబర్ 18, 2021తో ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు చొరబాటుదారుల బృందం పాక్‌ నుండి భారత్‌లోకి చొరబడిందని విశ్వసనీయ సమాచారం. 

యురి ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడగా.. ఈ ఘటనలో 19 మంది జవాన్ల వీర మరణం పొందారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో టెర్రరిస్టు లాంచ్‌ ప్యాడ్లపై భారత ఆర్మీ దాడులు జరిపింది. గత ఫిబ్రవరిలో భారత్‌, పాకిస్తాన్‌లు మరోసారి సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ తర్వాత టెర్రరిస్టులు భారత భూభాగంలోకి చొరబడటానికి యత్నించడం ఇది రెండో సారి.