మండుటెండల్లో ఈ బుడ్డోడు చేసిన పనికి హ్యాట్సాప్

మండుటెండల్లో ఈ బుడ్డోడు చేసిన పనికి హ్యాట్సాప్

వయసులో చిన్నవాళ్లైనా కొందరు చేసే పనులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి..ఆలోచిస్తాయి. వాళ్లని చూస్తే ఇంత చిన్నవయసులోనే  అంత పెద్ద మనసు ఎలా వచ్చిందో అనిపిస్తుంది. చిన్న వయసులో ఇతరులకు సాయం చేయడమనేది గొప్ప విషయం. ఓ బాలుడు మండుటెండల్లో  వీధివ్యాపారులకు మంచినీళ్లు అందిస్తూ కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీధి వ్యాపారులకు, రోడ్డు పక్కన పువ్వులు అమ్ముకునే వాళ్లకు వాటర్ బాటిల్స్ ను   ఇస్తున్నాడు. చెమటలు కారుతున్నా బాటిళ్ల సంచిని మోసుకుంటూ నీళ్ల బాటిళ్లు అందిస్తున్నాడు. బుడ్డోడు చేసిన పనికి ఓ అమ్మ అతడిని ఆశీర్వదించింది. ఐఏఎస్ అవనిశ్ శరణ్ ఈ వీడియో షేర్ చేశారు. వయస్సులో చిన్నవాడైన మనసులో పెద్దవాడంటూ  ప్రశంసించారు. ఈ వీడియోకు 2.23 లక్షలకు పైగా వ్యూస్, 14 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.