ఇంటర్న్ షిప్ చేస్తే ఉద్యోగానికి ఎంట్రీ దొరికినట్లే

ఇంటర్న్ షిప్ చేస్తే ఉద్యోగానికి ఎంట్రీ దొరికినట్లే

ఏ జాబ్​కెళ్లినా ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఉందా  అని అడుగుతారు? కెరీర్​ ప్రారంభంలో అందరూ ఎదుర్కొనే సమస్యే ఇది. మొదట ఎవరైనా జాబ్​ ఇస్తే కదా అనుభవం వస్తుంది. మరి జాబుల్లేకుండానే ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్‌‌‌‌ పొందడానికి వీల్లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే ఇంటర్న్‌‌‌‌షిప్. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ముందుగానే సాధించేందుకు వీలు కల్పించడమే కాక, కెరీర్ రేస్‌‌‌‌లో మైలేజీ ఇచ్చే ఇంటర్న్‌‌‌‌షిప్​ గురించి తెలుసుకుందామా మరి.

పొటెన్షియాలిటీ కలిగిన విద్యార్థులకు లైవ్ ఎన్విరాన్‌‌‌‌మెంట్​లో పనిచేసేందుకు కంపెనీలు ఆఫర్ చేసే షార్ట్‌‌‌‌ టెర్మ్​ ఎంప్లాయ్‌‌‌‌మెంట్​ లేదా వర్క్​ ఆపర్చునిటీనే ఇంటర్న్‌‌‌‌షిప్. ఎర్న్ వైల్​ లెర్న్‌‌‌‌ అనే కాన్సెప్ట్‌‌‌‌తో డొమైన్ నాలెడ్జ్‌‌‌‌, ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతున్న ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీకి గేట్‌‌‌‌వే లాంటివి. ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌ చేసే అభ్యర్థులను ఇంటర్న్స్‌‌‌‌ అంటారు. సాధారణంగా వీటి డ్యురేషన్ ఒక వారం మొదలుకొని సంవత్సరం వరకు ఉంటుంది. ఈ కాలంలో చాలా కంపెనీలు స్టైపెండ్​ చెలిస్తుండగా మరికొన్ని స్వచ్ఛందంగా చేసే ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌. అనంతరం సర్టిఫికెట్​ లభిస్తుంది. ఇది మీ రెజ్యూమ్​లో అదనపు క్వాలిఫికేషన్. ఒక సర్వే అంచనా ప్రకారం కనీసం 30 శాతం మంది ఇంటర్న్స్‌‌‌‌ను కంపెనీలు తిరిగి రిక్రూట్​ చేసుకుంటున్నాయి.

షార్ట్‌‌‌‌ టెర్మ్

కింది స్థాయిలో డేటా ఎంట్రీ, ఫోటోకాపీయింగ్​, ఫైలింగ్​, ఆఫీస్​ ఆటోమేషన్, సపోర్టింగ్​ ప్రాజెక్ట్స్‌‌‌‌, సార్టింగ్ డాక్యుమెంట్స్‌‌‌‌, షెడ్యూలింగ్ అపాయింట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ తదితర పనులు చేయడానికి కంపెనీలు షార్ట్‌‌‌‌టెర్మ్‌‌‌‌ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ ఆఫర్ చేస్తుంటాయి. ఇవి కొన్ని వారాల నుండి నెలల వరకు ఉంటాయి. ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్న వారికి షార్ట్‌‌‌‌టెర్మ్ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ బెస్ట్ ఆప్షన్. ప్రాజెక్ట్​ ఎవిడెన్స్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌, క్లైంట్​ రిలేషన్‌‌‌‌షిప్, ప్రాబ్లం సాల్వింగ్​, నెట్‌‌‌‌వర్క్ అండ్​ కాంటాక్ట్స్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్​ వంటి ప్రయోజనాలు ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకునేందుకు వీలుగా సమ్మర్ హాలిడేస్​లో లభించే ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లకు డిమాండ్​ ఎక్కువ.

లాంగ్​ టెర్మ్‌‌‌‌

ఉద్యోగార్థుల స్కిల్స్‌‌‌‌ టెస్ట్ చేయడంతో పాటు వారికి పర్మనెంట్​ ఎంప్లాయ్‌‌‌‌మెంట్​ కల్పించడానికి కంపెనీలు లాంగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ ఆఫర్ చేస్తాయి. ఇవి కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థులకు కోర్ వర్క్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌, రియల్‌‌‌‌ జాబ్ నాలెడ్జ్‌‌‌‌, టీమ్​ వర్క్‌‌‌‌ అలవడుతుంది. స్టైపెండ్ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో లాంగ్​ టెర్మ్‌‌‌‌ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌కి డిమాండ్​ ఎక్కువ. దీర్ఘకాలం పనిచేయడం ద్వారా బిజినెస్ కార్యకలాపాలపై అభ్యర్థులకు పూర్తి అవగాహన వస్తుంది కాబట్టి వీరిని శాశ్వతంగా నియమించుకోవడానికి కంపెనీలూ ఆసక్తి చూపిస్తాయి. షార్ట్‌‌‌‌టెర్మ్‌‌‌‌లో నేర్చుకోలేని కష్టతర సబ్జెక్ట్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ గెయిన్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ లాంగ్ టెర్మ్​ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌.

టైప్స్‌‌‌‌ ఆఫ్ ఇంటర్న్‌‌‌‌షిప్​

పెయిడ్​

స్కిల్స్‌‌‌‌ పెంచుకుంటూ సంపాదించే అవకాశం పెయిడ్​ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌లో ఉంది. మెడిసిన్, ఆర్కిటెక్చర్, సైన్స్, ఇంజినీరింగ్, లా, ఫైనాన్స్, అకౌంటింగ్​, టెక్నాలజీ, అడ్వర్‌‌‌‌‌‌‌‌టైజింగ్​ రంగాల్లో ఇవి ఎక్కువ. గ్రాడ్యుయేషన్ సెకండ్, థర్డ్​ ఇయ ర్‌‌‌‌‌‌‌‌లో చేసే ఈ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌లో స్టైపెండ్​ కొంత ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాటు కొన్ని కంపెనీలు ఫుడ్​, ట్రావెల్​ అలవెన్సులు కూడా చెల్లిస్తాయి. స్టూడెంట్స్‌‌‌‌ స్టడీస్‌‌‌‌లో మంచి మార్కులతో పాటు ప్రాక్టికల్​ నాలెడ్జ్‌‌‌‌ గెయిన్ చేయడానికి ఇవి తోడ్పడుతాయి.

పార్శియల్లీ పెయిడ్​

షార్ట్‌‌‌‌టెర్మ్‌‌‌‌, లాంగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌ కాలానికి చేసే పార్శియల్లీ పెయిడ్‌‌‌‌ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌లో స్టైపెండ్​ ఉండదు. కానీ ఈ కాలంలో ప్రోత్సాహకాలు, మెయింటెనెన్స్‌‌‌‌, ట్రావెల్​, ఫుడ్​ అలవెన్స్‌‌‌‌ల రూపంలో కంపెనీని బట్టి రూ.5 నుంచి 10 వేల వరకు చెల్లిస్తారు.

అన్‌‌‌‌పెయిడ్​

ఇవి వాలంటరీగా చేసే ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌. కేవలం డొమైన్ నాలెడ్జ్‌‌‌‌ గెయిన్‌‌‌‌ చేయడం కోసం చాలా మంది వీటిని ఎంచుకుంటారు. స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు సోషల్​వర్క్​ వంటి వాటిలో ఈ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ ఎక్కువ. స్కూల్​/కాలేజీలో ప్రాజెక్ట్‌‌‌‌ వర్క్‌‌‌‌ కోసం కూడా చేయవచ్చు.

రీసెర్చ్‌‌‌‌/వర్చువల్​

పర్టిక్యులర్​ సబ్జెక్ట్ లేదా ఏరియాపై రీసెర్చ్‌‌‌‌ చేయాలనుకునేవారికి సూటబుల్​ ఇంటర్న్‌‌‌‌షిప్ ఇది. ఆఫీస్‌‌‌‌కు వెళ్లకుండా మనకు నచ్చిన టైంలో ఫోన్, వెబ్​ లేదా ఈమెయిల్​ కమ్యూనికేషన్ ద్వారా చేయవచ్చు. ఇటీవల కాలంలో ఆన్‌‌‌‌లైన్ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ అందించే కంపెనీల సంఖ్య పెరుగుతోంది.

స్పాన్సర్డ్‌‌‌‌

ప్రాక్టికల్​ నాలెడ్జ్‌‌‌‌ కోసం సంస్థకే కొంత మొత్తం చెల్లించి చేసే ఇంటర్న్‌‌‌‌షిప్ ఇది. ఇందులో రీసెర్చ్, ప్రాక్టికల్​ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌లో అసిస్ట్​ చేసినందుకు అభ్యర్థులే కంపెనీలకు కొంత మొత్తం చెల్లించాలి. సాధారణంగా అకడమిక్ క్రెడిట్స్‌‌‌‌ ఇవ్వడానికి కొన్ని స్కూళ్లు/కాలేజీలు స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ చేసి వారి విద్యార్థులతో ఇంటర్న్‌‌‌‌షిప్ చేయిస్తాయి. కంపెనీ ఇచ్చే పర్‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌ రిపోర్టు ఆధారంగా క్రెడిట్స్‌‌‌‌ ఇస్తాయి.

ఇంటర్న్‌‌‌‌షిప్స్ అబ్రాడ్​

విదేశాల్లో చాలా ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లు క్రెడిట్స్‌‌‌‌ ఇవ్వడం కోసం పెయిడ్, పార్శియల్లీ పెయిడ్​​ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌ ఆఫర్ చేస్తుంటాయి. దీంతో పాటు స్టైపెండ్ కూడా లభిస్తుంది. లోకల్​ ఇంటర్న్‌‌‌‌షిప్స్‌‌‌‌తో పోల్చినప్పుడు డిఫరెంట్​ ఎక్స్‌‌‌‌పోజర్ ఇస్తాయి కాబట్టి వీటిని జాబ్స్‌‌‌‌ అనవచ్చు. గోల్డ్​మన్​ సాక్స్‌‌‌‌, కోనె, డెలాయిట్​, లోరిల్​, ఆయిస్టర్, వరల్డ్ బ్యాంక్​, కేపీఎంజీ తదితర అంతర్జాతీయ సంస్థలు ఇంటర్న్‌‌‌‌షిప్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాయి. ఇదివరకే అబ్రాడ్‌‌‌‌లో చదువుతున్న వారికి ఇవి ఉపయోగకరం. ఇవి చేయాలనుకునే వారికి కనీసం 3 నెలలకు తక్కువ కాకుండా వీసా లభిస్తుంది. దేశాన్ని బట్టి నెలకు 5 వేల యూఎస్ డాలర్లతో పాటు రానుపోనూ విమాన చార్జీలు అందిస్తారు

వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్‌‌‌‌