నీరవ్ సోదరుడికి ఇంటర్‌పోల్ నోటీసులు

V6 Velugu Posted on Sep 13, 2019

ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరుడు నెహాల్‌కు ఇవాళ ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది.PNB బ్యాంకు నుంచి సుమారు 13వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ఇంటర్‌పోల్ ఈ చర్య తీసుకుంది. నీరవ్ మోడీ బ్యాంకుల నుంచి డబ్బును విదేశాలకు చేరవేసేందుకు నెహాల్ సహకరించినట్లు ఈడీ చెప్పింది.ఈ క్రమంలో నెహాల్‌పై కేసు నమోదు చేయాలని కూడా ఇంటర్‌పోల్‌కు ఈడీ సూచించింది. అమెరికాలో ఉన్న నెహాల్ త‌న అవ‌స‌రాల కోసం నీర‌వ్‌ను వాడుకున్నాడని లండ‌న్ కోర్టు కూడా అభిప్రాయ‌ప‌డింది.

 

Tagged Nirav Modi, Red Corner Notice, Interpol issues, Nehal

Latest Videos

Subscribe Now

More News