ఢిల్లీలో ఇంటర్‌పోల్ సమావేశాలు.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

ఢిల్లీలో ఇంటర్‌పోల్ సమావేశాలు.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

ఇంటర్‌పోల్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఇంటర్ పోల్ 90వ వార్షిక సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి. ఈ  కార్యక్రమానికి 195 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశాలను ప్రధాని ప్రారంభించనుండగా.. అక్టోబర్ 21న కేంద్రం హోంమంత్రి అమిత్ షా సభలో ప్రసంగించనున్నారు.

ఇంటర్ పోల్ సమావేశాలకు విచ్చేసే ప్రతినిధులు జేఎల్ఎన్ స్టేడియం నుంచి ప్రగతి మైదాన్ కు చేరుకుంటారు. వీరు బసచేసే ప్రాంతాల నుంచి ట్రాఫిక్ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతినిధుల రాకపోకలను సులభతరం చేయడానికి అశోకా రోడ్, ఫిరోజ్ షా రోడ్, జన్ పథ్, బరాఖంబ రోడ్, సికింద్రా రోడ్డు, మధుర రోడ్డు, సుబ్రమణ్య భారతి మార్గ్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ మార్గ్, డా.ఏపీజే అబ్దుల్ కలాం మార్గాలలో ట్రాపిక్ ను క్రమబద్ధీకరించనున్నారు.