
తిరుపతి జిల్లా రేణిగుంటలో ల్యాప్ టాప్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 లక్షల రూపాయలు, 15 లాప్ టాప్ లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మనోహర చారి పర్యవేక్షణలో రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి పోలీసుల చాకచక్యంతో ముద్దాయిలను పట్టుకున్నారు.
రేణిగుంటలోని ఓ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఏఎస్పి రవి మనోహరా చారి... ఏర్పేడు మండలంలోని ఐఐటి.. తిరుపతి కాలేజీలో ఇటీవల లాప్ టాప్ దొంగల ముఠాను ఏర్పేడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తమిళనాడుకు చెందిన తమిళ్ సెల్వన్, కోయంబత్తూరు కు చెందిన వీరస్వామి గణేష్ గా గుర్తించారు. వీరికి గతంలో నేర చరిత్ర ఉందని తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. .. వీరిపై తొమ్మిది కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరు... చెన్నై... నాగపూర్... జోధాపూర్ ...గోపాల్ ...వంటి నగరాల్లో లాప్ టాప్ లను దొంగలించారు. దొంగల ముఠాను పట్టుకుని.. విద్యార్థుల ల్యాప్టాప్ లు రికవరీ చేసిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.