బాగువ కండువాలతో పోలింగ్ కేంద్రంలోకి.. స్వల్ప ఉద్రిక్తత

బాగువ కండువాలతో పోలింగ్ కేంద్రంలోకి.. స్వల్ప ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా ముధోల్ లోని ముక్తదేవి గల్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు బాగువ దుస్తులతో ఓటు వేయడానికి వెళ్లారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఓటర్లను అడ్డుకున్నారు. బాగువ దుస్తులతో ఓటు వేయడానికి రావద్దని వారికి సూచించారు. ఈ క్రమంలో 100 మీటర్ల దూరంలో ఏర్పాట్లు చేసిన భారీ గేట్ల వద్ద రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాగువ కలర్ కండువాలు ఎందుకు వేసుకుని వెళ్తున్నారని ఓ పార్టీ కార్యకర్తలు అడగడంతో వివాదం తలెత్తింది. తాము పార్టీ కండువా వేసుకోలేదని, ఆ కలర్ కర్చీఫ్ మాత్రమే వేసుకున్నామని వేరొక పార్టీ కార్యకర్తలు బదులిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్నాయి. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారు. భారీ భద్రత నడుమ అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగుతోంది. ఈ క్రమంలోనే పలు సినీ, రాజకీయ ప్రముఖులు అందరిలాగే క్యూలైన్లలో నిలబడి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.