నటుడు ‘నందమూరి కల్యాణ్ రామ్’ ‘బింబిసార’ హిట్ అనంతరం ఫుల్ జోష్ లో ఉన్నాడు. రెండు సినిమాలకు ఒకే చెప్పాడు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అమిగోస్’ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో కల్యాణ్ డిఫరెంట్ లో కనిపించనున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. లెటెస్ట్ గా కల్యాణ్ కు సంబంధించి మరో పోస్టర్ ను మైత్రీ విడుదల చేసింది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చాలా సాఫ్ట్ లుక్ తో .. చాలా పద్ధతిగా కనిపిస్తున్నాడు. కల్యాణ్ కు జోడిగా ఆషిక రంగనాథ్ కనిపించనున్నారు. ట్రిపుల్ రోల్ లో ఆయన కనిపించనున్నారని సమాచారం. త్వరలో టీజర్ ను వదిలేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.