భాషా పండితుల గీతం సీడీ ఆవిష్కరణ

భాషా పండితుల గీతం సీడీ ఆవిష్కరణ

ఖైరతాబాద్​,వెలుగు : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్​ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో  ‘ భాషా పండితుల గీతం’ సీడీ ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్​రెడ్డి హర్షవర్ధన్​రెడ్డి హాజరై సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. భాషా పండితుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిందన్నారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి కాంతికృష్ణ, పీఆర్​టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్​,గేయ నిర్మాత వివేక్​భవాని, ఎండీ అమీర్​పాషా   పాల్గొన్నారు.