‘కాంటినెంటల్’ హాస్పిటల్ పై దర్యాప్తు చేపట్టండి

‘కాంటినెంటల్’ హాస్పిటల్ పై దర్యాప్తు చేపట్టండి

 

కాంటినెంటల్ ఆస్పత్రి ఘటనపై  డీఎంహెచ్వోకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కరోనాతో తన భర్త చనిపోతే రూ.6.41 లక్షల బిల్లు చెల్లిస్తేనే డెడ్ బాడీని ఇస్తామని హైదరాబాద్‌‌లోని కాంటినెంటల్‌‌ హాస్పిటల్ మేనేజ్ మెంట్ చెప్పిందని కె.లావణ్య అనే మహిళ ఫైల్ చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం అత్యవసరంగా విచారించింది. ఘటనపై బాధితురాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుంటే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ వేస్తామన్న హాస్పిటల్ మేనేజ్ మెంట్ వినతిని అంగీకరించిన కోర్టు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. లావణ్య భర్త ఈ నెల13న హాస్పిటల్ లో చేరితే 22న మరణించా డని.. రూ.6.41 లక్షల బిల్లు కడితేనే బాడీని అప్పగిస్తామన్నా రని పిటిషనర్ లాయర్ చెప్పారు. పోలీసులకు, జీహెచ్‌ ఎంసీకి చెప్పలేదని, సర్కార్ నిర్ణయించి న ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేసిందని ఆరోపించారు. పోలీసులు, జీహెచ్‌ ఎంసీ సిబ్బం ది సమక్షంలోనే తర్వాత రోజు అంత్యక్రియలు జరిగాయని హాస్పిటల్ తరఫు లాయర్ చెప్పారు.