శివరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

శివరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

అమరావతి: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఆహ్వానించారు  శ్రీశైల దేవస్ధానం శ్రీశైలం ఈవో కేఎస్ రామారావు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి ఈవో రామారావు సీఎం జగన్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో సీఎం జగన్ కు వివరించారు. స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు, క్యాలెండర్‌ ను సీఎం జగన్ కు  అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు శ్రీశైల దేవస్థానం వేదపండితులు. శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలతో ప్రచురించిన శ్రీశైల ఖండం పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

ఇవి కూడా చదవండి

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు

28న ‘ప్రైవేట్‌’తో ఇస్రో తొలి ప్రయోగం

పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు