జోగులాంబ బ్రహ్మోత్సవాలకు గవర్నర్​కు ఆహ్వానం

జోగులాంబ బ్రహ్మోత్సవాలకు గవర్నర్​కు ఆహ్వానం

అలంపూర్, వెలుగు : జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని గవర్నర్​ తమిళిసైను ఆలయ ఈవో పురేందర్ కుమార్, చైర్మన్​ చిన్నకృష్ణయ్య, ప్రధాన అర్చకులు ఆనంద్​ శర్మ, బండి శ్రీనివాస్​ ఆహ్వానించారు. శుక్రవారం రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి అమ్మవారి జ్ఞాపిక, ప్రసాదాలనుఅందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు. ఈ నెల 14న జోగులాంబ ఆలయానికి వస్తానని గవర్నర్​ చెప్పారన్నారు.

నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నుంచి ఈ నెల14 వరకు జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి స్వామి వారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, మహా కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం ఉంటుందన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.