
హైదరాబాద్, వెలుగు: పౌల్ట్రీ పరిశ్రమ కోసం హైదరాబాద్లో నవంబర్ లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 17వ ఎడిషన్ జరగనుంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఈ ఎక్స్‌పోను నవంబర్ 25 నుంచి 28 వరకు దీనిని నిర్వహించనుంది.
సస్టెయినబుల్ ఫీడ్, పౌల్ట్రీ ఆటోమేషన్, పౌల్ట్రీ ఆరోగ్యం, పేడ నిర్వహణ, ఈ రంగంలో కెరీర్ అవకాశాలు లాంటి కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. ఈ ఎక్స్‌పోలో 50కి పైగా దేశాల నుంచి 500కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. సుమారు 50 వేల మంది సందర్శిస్తారని అంచనా.
ఈ ఎడిషన్లో బ్రీడింగ్, హేచరీ ఆటోమేషన్, ఫీడ్ మిల్లింగ్, వెటర్నరీ ఉత్పత్తులు, పౌల్ట్రీ హోమ్స్ ప్రదర్శిస్తారు. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐపీఈఎంఏ ఈ వివరాలను వెల్లడించింది. మన దేశంలో ప్రోటీన్ లోపాన్ని అరికట్టాలంటే గుడ్ల వాడకం పెరగాలని స్పష్టం చేసింది.