ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోనే

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోనే

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్‌ . ఐపీఎల్‌ ఫైనల్‌ కు మరోసారి ఆతిథ్యం ఇచ్చే లక్కీఛాన్స్​ మన భాగ్యనగరానికి దక్కింది.పన్నెండో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుదిపోరు వచ్చే నెల 12న ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరగనుంది.డిఫెండింగ్‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెన్నై హోమ్‌ గ్రౌండ్‌ చెపాక్‌ స్టేడియంలో జరగాల్సిన ఫైనల్‌ ను హైదరాబాద్‌ కు మారుస్తున్నట్టు బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ సోమవారం ప్రకటించారు. చెపాక్‌ స్టేడియంలో వివాదంలో ఉన్న మూడుస్టాండ్లను తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ)పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెచ్చుకోవడంలో విఫలమైంది. దాంతో,ఫైనల్‌ వేదికను హైదరాబాద్‌ కు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

మే 7న జరిగే తొలి క్వాలి ఫయర్‌ ను మాత్రం చెన్నైకే కేటాయించా రు. చెన్నైసూపర్‌ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే సొంతగడ్డపై ఈ మ్యాచ్‌ ఆడనుంది.కానీ, ఎలిమినేటర్‌ (మే 8), రెండో క్వాలి ఫయర్‌(మే 10) మ్యాచ్‌ లను విశాఖపట్నంకు తరలించింది. ఫైనల్‌ తో పాటు ఎలిమినేటర్‌ , ఏదో ఒకక్వాలి ఫయర్‌ మ్యాచ్‌ ఆతిథ్యం కూడా హైదరాబాద్‌ కే దక్కాల్సిం ది. కానీ, ఈ మ్యాచ్‌ లు జరగాల్సినటైమ్‌ లో తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలు (తొలిరెండు విడతలు మే 6, 10) ఉన్నందున కేవలం ఫైనల్‌ ను మాత్రమే కేటాయించారు. ‘చెపాక్‌ స్టే -డియంలో ఐ,జె,కె స్టాండ్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ అనుమతులు తెచ్చుకోలేకపోయింది.ఈ మూడు స్టాండ్లలో 12 వేల పై చిలుకు టిక్కె ట్లు ఉంటాయి. నాకౌట్‌ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాల బాధ్యత బీసీసీఐదే. స్టాండ్లకు అనుమతి లేకపోతే బోర్డు కోట్ల రూపాయాలు కోల్పోనుంది. అందుకే ఫైనల్‌ ను హైదరాబాద్‌ కు మార్చా ల్సి వచ్చింది.చెన్నై డిఫెండింగ్‌ చాంప్‌ కా బట్టి తొలుత క్వాలిఫయర్‌ 1, ఫైనల్‌ కేటాయించారు. ఒకవేళ లీగ్‌దశలో ఆ జట్టు టాప్‌–2లో నిలిచినా కూడా హోమ్‌ గ్రౌండ్‌ లో ఒక్క ప్లేఆఫ్‌ ఆడకుం టే బాగుం డదు.కనీసం ఒక నాకౌట్‌ కు ఆతిథ్యం ఇచ్చే అర్హతచెన్నైకి ఉంది. అందుకే తొలి క్వాలి ఫయర్‌ను చెన్నైకే కేటాయించామని రాయ్‌ తెలిపారు.

మే 6 నుంచి 10 వరకు మహిళల మినీ ఐపీఎల్

తొలిసారి మూడు జట్లతో కూడిన మహిళల మినీఐపీఎల్‌ షెడ్యూల్‌ ను బోర్డు ప్రకటించింది. మే 6నుంచి 10వ తేదీ వరకూ జైపూర్‌ లో ఈ లీగ్‌ జరగనుంది. గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకైక ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ఆడిన ట్రైల్‌ బ్లేజర్స్‌ , సూపర్‌ నోవాస్‌ తో పాటు ఈసారి కొత్త టీమ్‌ వెలాసిటీ బరిలో నిలవనుంది.