
అబుదాబి: ఐపీల్ సీజన్ 13లో భాగంగా అబుదాబి వేదికగా SRHతో జరుగుతున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫైనల్ పై గురిపెట్టిన ఈ రెండు టీమ్స్ విక్టరీపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి. ఫస్ట్ నుండి జోష్ లో ఉన్న ఢీల్లీ .. చివరకు చతికిలా పడుతూ వచ్చింది. ఈ మ్యాచ్ తో ఆ జోష్ చూపించాలనకుంటుంది. వరుస విక్టరీలతో కాన్ఫిడెంట్ గా ఉన్న హైదరాబాద్ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. దీంతో ఇవాళ జరగబోయే క్వాలిఫయర్-2 క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఇవ్వడం ఖాయం అని చెప్పవచ్చు.