IPL 2019: అవార్డులు.. ప్రైజ్ మనీ వివరాలు

IPL 2019: అవార్డులు.. ప్రైజ్ మనీ వివరాలు

IPL -12 సీజన్‌లో 8 జట్ల మధ్య పోరు హోరాహరీగా సాగింది. 59 మ్యాచ్‌ల IPL సీజన్‌కు తెరపడింది.  ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించి.. ట్రోఫీని గెలుచుకుంది. దీంతో 2013, 2015, 2017, 2019 నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది ముంబై ఇండియన్స్. నాలుగుసార్లూ ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉన్నాడు.

విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రైజ్‌ మనీగా రూ. 20 కోట్లు గెలుచుకుంది. రన్నర్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌కి రూ. 12.50 కోట్లు ప్రైజ్‌ మనీ లభించింది.

ప్రైజ్ మనీ వివరాలు….

…ఫెయిర్‌ ప్లే అవార్డు: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌
….పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు): ఇమ్రాన్‌ తాహీర్‌( సిఎస్‌కె) రూ. 10 లక్షలు
….ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు): డేవిడ్‌ వార్నర్‌( ఎస్‌ఆర్‌హెచ్‌), రూ. 10 లక్షలు
….అత్యధిక విలువైన ఆటగాడు: ఆండ్రి రసెల్‌( కెకెఆర్‌), హారియర్‌ కారుతో పాటు చెక్కు
…సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌: ఆండ్రి రసెల్‌ (కెకెఆర్‌), రూ. 10 లక్షలు
….గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: రాహుల్‌ చాహర్‌, రూ.10 లక్షలు
….స్టైలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: కేఎల్‌ రాహుల్‌, రూ.10 లక్షలు
….అత్యంత వేగవంతమైన అర్ధశతకం, రూ. 10 లక్షలు
…ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: శుభమన్‌గిల్‌, రూ. 10 లక్షలు
…పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: కీరన్‌ పొలార్డ్‌, రూ. 10 లక్షలు
….ఉత్తమ పిచ్‌, మైదానం: హైదరాబాద్‌, మొహాలీ(పంజాబ్‌)