
కోల్‌కతా: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13వ ఎడిషన్ ఆక్షన్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజు పాటు జరిగే ఈ వేలంలో 73 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ వెస్టిండీస్, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్లపై గురిపెట్టాయి. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో విదేశీ టీమ్‌ల్లో ఉండే కుర్రాళ్లకు కూడా భారీ డిమాండ్ నెలకొంది. 14 ఏళ్ల 350 రోజుల వయసు ఉన్న అఫ్గానిస్థాన్ యువ క్రికెటర్ నూర్ అహ్మద్.. ఐపీఎల్ ఆక్షన్ పూల్‌లో ఉన్న అతిపిన్న వయసు క్రికెటర్. లెఫ్టార్మ్ చైనామెన్ బౌలింగ్ చేసే ఇతని బేస్‌ప్రైస్ రూ. 30 లక్షలు. ఇటీవల ఇండియా అండర్–19 టీమ్‌తో జరిగిన సిరీస్‌లో 9 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 20 లక్షల బేస్‌ప్రైస్‌తో కలిగిన ముంబై ఓపెనర్ యశస్వి జైస్వాల్, ప్రియమ్ గార్గ్, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆర్. సాయి కిశోర్, బెంగాల్ పేసర్ ఇషాన్ పోరెల్ కూడా మంచి ధర పలికే చాన్స్ ఉంది. రూ. 50 లక్షల బేస్‌ప్రైస్ కలిగిన విండీస్ బిగ్ హిట్టర్ హెట్‌మయర్ కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ నెలకొంది. అయితే రైట్ టు మ్యాచ్ కార్దు ద్వారా హెట్‌మయర్‌ను దక్కించుకోవాలని ఆర్‌సీబీ కసరత్తులు చేస్తోంది. టీ20ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ను ఇబ్బందిపెట్టిన పేసర్ కెస్రిక్ విలియమ్స్ (రూ. 50 లక్షలు) కూడా భారీ బిడ్డింగ్ దక్కొచ్చని సమాచారం. అయితే కొన్ని ఫ్రాంచైజీల వద్ద లిమిటెడ్ మనీ ఉండటంతో బేస్‌ప్రైస్ ఎక్కువగా ఉండే క్రికెటర్ల కోసం భారీగా వెచ్చించే చాన్స్ లేదు.
ఆసీస్ నుంచి ఐదుగురు
ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్.. ఐపీఎల్‌కు దూరం కావడంతో బరిలో ఉన్న కమిన్స్, హాజిల్‌వుడ్, లైన్, మాక్స్‌వెల్ పెద్ద మొత్తంలో డ్రా చేసే అవకాశం ఉంది. అయితే రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో ఉన్న డేల్ స్టెయిన్, మాథ్యూస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి ఆర్‌సీబీ అందరికంటే ఎక్కువ మంది క్రికెటర్లను వదులుకోవడంతో దాదాపు 10, 12 మంది కొత్తవారిని తీసుకునే చాన్స్ ఉంది. కానీ అందుబాటులో ఉన్న రూ. 27.90 కోట్లను ఎంత మందికి సర్దుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎవరి దగ్గర ఎంత?
వేలంలో స్టార్లను కొనాలంటే భారీ మొత్తంలో ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఎనిమిది ఫ్రాంచైజీల్లో అత్యధికంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద రూ. 42.70 కోట్లు ఉన్నాయి. రాక్ సాలిడ్ టాప్ ఆర్డర్‌ను కలిగి ఉన్న పంజాబ్.. టాప్ స్పిన్నర్ కోసం చూస్తోంది. కెప్టెన్ అశ్విన్‌ను ఢిల్లీకి వదిలేసిన పంజాబ్ ఈసారి నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇస్తుందో చూడాలి. చెన్నై రూ. 14.60 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 27.85 కోట్లు, కోల్‌కతా రూ. 35.65 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 13.05 కోట్లు, రాజస్థాన్ రూ. 28.90 కోట్లు, బెంగళూరు రూ. 27.90 కోట్లు, హైదరాబాద్ రూ. 17 కోట్లు ఖర్చు చేయొచ్చు.