వైరల్ వీడియో: క్రేజీ ఫ్యాన్స్.. బాల్స్ కోసం స్టేడియం బయట వెయిటింగ్

వైరల్ వీడియో: క్రేజీ ఫ్యాన్స్.. బాల్స్ కోసం స్టేడియం బయట వెయిటింగ్

దుబాయ్: ఐపీఎల్ పదమూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. కరో్నా పుణ్యమాని దేశంలో జరగాల్సిన మెగా టోర్నీ కాస్తా యూఏఈకి షిఫ్ట్ అయింది. దుబాయ్, అబు దాబి, షార్జాల్లో మ్యాచ్‌‌లు నిర్వహిస్తున్నారు. ఈ మూడు వేదికల్లో షార్జాలో బౌండరీ లైన్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ గ్రౌండ్‌‌లో హార్డ్ హిట్లర్లు కొడుతున్న భారీ సిక్సులు స్టేడియానికి అవతల ఉన్న రోడ్లపై పడుతున్నాయి.

షార్జా గ్రౌండ్‌‌లో మ్యాచ్ జరిగినప్పుడు క్రికెటర్లు కొట్టే భారీ సిక్సుల కోసం కొందరు ఫ్యాన్స్ బయట ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ గ్రౌండ్‌‌లో జరుగుతుంటే ఫ్యాన్స్ బయట వెయిట్ చేయడమేంటని అనుకుంటున్నారా? ఏం లేదండి.. క్రికెటర్స్ కొట్టిన బంతులు స్టేడియం బయటపడితే క్యాచ్ చేద్దామనో లేదా బాల్స్‌‌ను పట్టుకెళ్దామనో వీళ్ల ఎదురు చూపులు. షార్జా స్టేడియం వెనుక వైపు ఉన్న రోడ్డులో బంతి కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఉన్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్‌‌లో వైరల్ అవుతున్నాయి.