
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. 14 ఫోర్లు, 7 సిక్సులతో 132 రన్స్ కొట్టి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఛేజింగ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ తడబడటంతో పంజాబ్ 97 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ ద్వారా రాహుల్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 60 ఇన్నింగ్స్‌లలో రాహుల్ ఈ ఫీట్‌ను చేరుకున్నాడు. సచిన్ ఈ మార్క్‌ను చేరుకోవడానికి 63 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. రాహుల్ మూడు ఇన్నింగ్స్‌ల ముందుగానే ఈ ఘనతను సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఐపీఎల్‌లో 2 వేల రన్స్‌ను ఫాస్టెస్ట్‌గా చేరుకున్న రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును చేరుకున్నాడు.