ఐపీఎల్ ట్రోఫీ నా బెల్టు‌కు ఉండాలి

ఐపీఎల్ ట్రోఫీ నా బెల్టు‌కు ఉండాలి

న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో పంజాబ్ ప్లేయర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 41 ఏళ్ల ఈ కరీబియన్ స్టార్.. వరుసగా మెరుపు ఇన్నింగ్స్‌‌లతో మైమరిపిస్తున్నాడు. టీమ్‌‌లో ఆలస్యంగా చోటు దక్కించుకున్న గేల్.. పంజాబ్‌‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో 8 సిక్సులు, 6 బౌండరీలతో 99 రన్స్ చేసిన గేల్.. తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

‘99 రన్స్ చేసి ఔటవ్వడం దురదృష్టకరం. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయినా బాగానే అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఇదంతా నా గేమ్‌‌లోని మానసిక కోణం గురించే. దాంతోనే నేను ముందుకు వెళ్తుంటా. నేను క్రికెట్‌‌ను అదే విధంగా ఆస్వాదిస్తుంటా. ఐపీఎల్ ట్రోఫీ నా బెల్ట్‌‌కు ఉండాలనేది నా కోరిక. అందుకు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది మాకు చాలా ముఖ్యమైన గేమ్. ఈ మ్యాచ్‌‌లో గెలవాలనుకున్నాం. యువకులతో కలసి ఆడటం నాకు ఇష్టం. టీ20ల్లో 1,000 సిక్సులు కొట్టానన్న విషయం గురించి నాకు తెలియదు. నేను ఇప్పటికీ బాగా హిట్టింగ్ చేస్తున్నా. గడిచిన కొన్నేళ్లలో పడిన కష్టానికి, అంకితభావానికి తగిన ఫలితాలు వస్తున్నాయి. నేను సెంచరీ కొడతానని ప్రామిస్ చేసిన వారి దగ్గర ఇవ్వాళ మాట తప్పా. కానీ అది శతకంతో సమానమే’ అని గేల్ చెప్పాడు. గేల్ మెరుపు ఇన్నింగ్స్ వృథా అయింది. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బట్లర్ రాణించడంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.