చెన్నై పై రాయల్ గా గెలిచిన రాజస్థాన్

చెన్నై పై రాయల్ గా గెలిచిన రాజస్థాన్

16 పరుగుల తేడాతో విజయం

శాంసన్, స్మిత్ విధ్వంసం

ఓవైపు శాంసన్‌ (32 బాల్స్‌‌లో 74, 1 ఫోర్‌‌, 9 సిక్సర్లు).. మరోవైపు స్మి త్‌ (47 బాల్స్‌‌లో 69, 4 ఫోర్లు, 4 సిక్సర్లు).. ఈ ఇద్దరు చాలదన్నట్లు ఆఖర్లో ఆర్చర్‌‌ (8 బాల్స్‌‌లో 27 నాటౌట్‌, 4 సిక్సర్లు) సిక్సర్ల జడివాన కురిపించడంతో.. ఐపీఎల్‌ లో రాజస్తాన్‌ రాయల్స్‌‌ శుభారంభం చేసింది..! ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొడుతూ.. తమకంటే మెరుగైన ప్రత్యర్థి చెన్నైకి సూపర్‌‌గా చెక్‌ పెట్టింది..! మరోవైపు భారీ టార్గెట్‌ ను ఛేజ్‌ చేసే క్రమంలో సీఎస్‌ కే టాప్‌ ఆర్డర్‌‌ విఫలమైనా.. డుప్లెసిస్‌ (37 బాల్స్‌‌లో 72, 1 ఫోర్‌‌, 7 సిక్సర్లు), ధోనీ (17 బాల్స్‌‌లో 29 నాటౌట్‌ , 3 సిక్సర్లు) ధనాధన్‌ దెబ్బకు విజయం ముంగిట్లో ఆగిపోయింది..! ఓవరాల్‌ గా ఒక మ్యాచ్‌‌లోనే ఇరుజట్లు కలిపి 416 రన్స్‌‌ చేయడం ఐపీఎల్‌ పై జోష్‌ పెంచింది..!

షార్జా: ఐపీఎల్‌‌‌‌-–13ను రాజస్తాన్‌ అద్భుతంగా స్టార్ట్‌‌‌‌ చేసింది. స్టార్‌ బ్యాట్స్‌‌‌‌మన్‌ అంచనాలను అందుకోవడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌ లో 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కిం గ్స్‌‌‌‌ను ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 చేసింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 రన్స్‌‌‌‌ చేసింది. శాంసన్‌ కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’లభించింది.

స్మిత్‌ , శాంసన్‌ అదుర్స్‌‌‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన యంగ్‌‌‌‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌‌‌‌ (6).. మూడో ఓవర్‌ లోనే ఔటైనా.. స్మిత్‌ తో కలిసి శాంసన్‌ విధ్వంసం సృష్టించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడినా తర్వాత ఈ జోడీ పరుగుల వర్షం కురిపించింది. ముఖ్యంగా అపోజిట్‌ స్పిన్నర్లను ఈ ఇద్దరు ఊచకోత కోశారు. వీళ్ల దెబ్బకు జడేజా, చావ్లా ఎనిమిది ఓవర్లలో 95 రన్స్‌‌‌‌ సమర్పించుకున్నారు. కరన్‌ , ఎంగిడి, చాహర్‌ ఓవర్లలోనూ సిక్సర్లు బాదడంతో పవర్‌ ప్లేలో రాజస్తాన్‌ 54/1 స్కో రు చేసింది. రన్స్‌‌‌‌ కట్టడి చేసే వ్యూహంలో ఏడో ఓవర్‌ లో జడేజాను తీసుకొచ్చినా ప్రయోజనం లభించలేదు. ఈ ఓవర్‌ లో శాంసన్‌ రెండు వరుస సిక్సర్లు బాదడంతో 14 రన్స్‌‌‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌ లో చావ్లా ఏకంగా నాలుగు సిక్సర్లు ఇచ్చుకున్నాడు. ఇందులో మూడు శాంసన్‌ , ఒకటి స్మిత్‌ దంచాడు. ఈ క్రమంలో శాంసన్‌ 19 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేశాడు. జడేజా తన రెండో ఓవర్‌ లో 4 రన్సే ఇచ్చినా.. చావ్లా మాత్రం 6, 6, 4తో 19 రన్స్‌‌‌‌ సమర్పించుకున్నాడు. దీంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌ ఓవర్స్‌‌‌‌లో రాయల్స్‌‌‌‌ 119/1 స్కో రు సాధించిం ది. 11వ ఓవర్‌ లో జడేజా మరో సిక్స్‌‌‌‌ ఇచ్చినా.. 12వ ఓవర్‌ లో మ్యాచ్‌ కాస్త టర్న్‌‌‌‌ అయ్యింది. ఎంగిడి.. మూడు బంతుల తేడాలో శాంసన్‌, మిల్లర్‌ (0)ను ఔట్‌ చేయడంతో చెన్నై రేస్‌ లోకి వచ్చింది. స్మిత్‌ , శాంసన్‌ రెండో వికెట్‌ కు 121 రన్స్‌‌‌‌ జోడించా రు. అప్పటికే 35 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన స్మిత్‌ .. 14వ ఓవర్‌ లో ఇచ్చిన క్యాచ్‌ ను లాంగాఫ్‌ లో కరన్‌ జారవిడిచాడు. కానీ తర్వాతి ఓవర్‌ (15) ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కే ఊతప్ప (5) వికెట్‌ పడటంతో మళ్లీ సీఎస్‌ కే శిబిరంలో ఆనందం నెలకొంది. 17వ ఓవర్‌ లో టెవాటియా (10), రియాన్‌ పరాగ్‌‌‌‌ (6) వికెట్లు తీసిన కరన్‌ .. 19వ ఓవర్‌ లో స్మిత్‌ ను ఔట్‌ చేశాడు. కానీ లాస్ట్‌‌‌‌ ఓవర్‌ లో ఆర్చర్‌ దుమ్మురేపాడు. ఎంగిడి వేసిన ఈ ఓవర్‌ లో నాలుగు సిక్సర్లతో (ఇందులో రెండు నో బాల్స్‌‌‌‌) కలిపి 30 రన్స్‌‌‌‌ రాబట్టడంతో రాజస్తాన్‌ స్కో రు 200లు దాటింది.

స్కోరు బోర్డు:

రాజస్తాన్‌ :

జైస్వాల్‌‌ (సి అండ్‌ బి) చహర్‌ 6, స్మిత్‌ (సి) కేదార్‌ (బి) కరన్‌ 69, శాంసన్‌ (సి) చహర్‌ (బి) ఎంగిడి 74, మిల్లర్‌ (రనౌట్‌ ) 0, ఊతప్ప (సి) డుప్లెసిస్‌ (బి) చావ్లా 5, టెవాటియా (ఎల్బీ) కరన్‌ 10, పరాగ్‌‌ (సి) ధోనీ (బి) కరన్‌ 6, టామ్‌ కరన్‌ (నాటౌట్‌ ) 10, ఆర్చర్‌ (నాటౌట్‌ ) 27 ;

ఎక్స్‌‌ట్రాలు: 9 ;మొత్తం : 20 ఓవర్లలో 216/7

వికెట్ల పతనం: 1–11, 2–132, 3– 134, 4–149, 5 –167, 6–173, 7–178 ; బౌలింగ్‌‌ : దీపక్‌ 4–0 –31–1, కరన్‌ 4–0–33–3, ఎంగిడి

4–0–56–1, జడేజా 4–0–40–0, చావ్లా 4–0–55-1.

చెన్నై:

విజయ్‌ (సి) కరన్‌ (బి) గోపాల్‌‌ 21, వాట్సన్‌ (బి) టెవాటియా 33, డుప్లెసిస్‌ (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌ 72, కరన్‌ (స్టంప్‌) శాంసన్‌ (బి) టెవాటియా 17, రుతురాజ్‌ (స్టంప్‌ ) శాంసన్‌ (బి) టెవాటియా 0, కేదార్‌ (సి) శాంసన్‌ (బి) టామ్‌ కరన్‌ 22, ధోనీ (నాటౌట్‌ ) 29, జడేజా(నాటౌట్‌ )1 :

ఎక్స్‌‌ట్రాలు: 5 ; మొత్తం 20 ఓవర్లలో 200/6 ;

వికెట్ల పతనం: 1–56, 2–58, 3–77, 4–77, 5–114, 6–179 ;

బౌలింగ్‌‌: ఉనాద్కట్‌ 4–0–44–0, జోఫ్రా ఆర్చర్‌ 4–0–26–1, గోపాల్‌‌ 4–0–38–1, టామ్‌ కరన్‌ 4–0–54–1, రాహుల్ టెవాటియా 4–0–37–3.

అంపైర్లు..అవే తప్పులు

ఐపీఎల్‌‌లో అంపైరింగ్‌‌ తప్పులు కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌‌లో ఆన్‌ ఫీల్డ్‌‌ అంపైర్‌ సి.శంషుద్దీన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయం విమర్శపాలైంది. వివరాల్లోకి వెళ్తే.. దీపక్‌ చాహర్‌వేసిన ఇన్నింగ్స్‌‌ 18వ ఓవర్‌ లో బాల్‌‌.. టామ్‌ కరన్‌ బ్యాట్‌ ను తాకుతూ వెళ్లింది. క్యాచ్‌ అందుకున్న ధోనీ అప్పీల్‌‌ చేయడంతో వెనకాముం దు ఆలోచిం చకుండా శంషుద్దీన్‌ ఔట్‌ ఇచ్చాడు. రాజస్తాన్‌ కు ఉన్న ఏకైక డీఆర్‌ఎస్‌ ను టెవాటియా వాడుకోవడంతో కరన్‌ .. రివ్యూకు వెళ్లకుండా పెవిలియన్‌ కు వెళ్లిపోయాడు. కానీ ఎందుకో తన నిర్ణయంపై అనుమానం వచ్చిన శంషుద్దీన్‌ .. స్క్ వేర్‌ లెగ్‌‌ అంపైర్‌ వినీత్‌ కులకర్ణిని సంప్రదించి డెసిషన్‌ ను టీవీ అంపైర్‌ కు నివేదించాడు. అయితే బాల్‌‌ నేలకు తాకిన తర్వాత ధోనీ క్యాచ్‌ అందుకున్నాడని టీవీ రీప్లే ల్లో స్పష్టంగా తేలడంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని నాటౌట్‌ గా మార్చుకున్నాడు. దీనిపై ఎంఎస్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఓ ఐదు నిమిషాల పాటు అంపైర్‌ తో వాగ్వాదం చేశాడు.

డుప్లెసిస్‌ చెలరేగినా..

మురళీ విజయ్‌ (21), షేన్‌ వాట్సన్‌ (33) ఆచితూచి ఆడడంతో తొలి మూడు ఓవర్లలో 19 పరుగులే వచ్చాయి. అయితే టామ్‌ కరన్‌ వేసిన ఆరో ఓవర్‌ లో వాట్సన్‌ 6, 6,4 కొట్టడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి చెన్నై 53 రన్స్‌‌‌‌ చేసింది. కానీ రాజస్తాన్‌ బౌలర్లు ఆ తర్వాత వరుస ఓవర్లలో ఓపెనర్లిద్దరిని పెవిలియన్‌ చేర్చి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టారు. టెవాటియా వేసిన తొమ్మిదో ఓవర్‌ లో సామ్‌ కరన్‌ (17) వరుస సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్‌‌‌‌కు ఊపుతెచ్చాడు. కానీ ఆ ఓవర్‌ చివరి రెండు బాల్స్‌‌‌‌కు కరన్‌ సహా రుత్‌ రాజ్‌ గైక్వాడ్‌ (0) స్టంపౌటయ్యారు. గోపాల్‌‌‌‌ వేసిన 12వ ఓవర్‌ లో కేదార్‌ జాదవ్‌ (22) హ్యాట్రిక్‌ బౌండ్రీలు కొట్టాడు. కానీ సాధించాల్సిన రన్‌ రేట్‌ అప్పటికే 15 దాటింది. వన్‌ డౌన్‌ లో వచ్చిన డుప్లెసిస్‌ నెమ్మదిగా ఆడుతుండగా.. టామ్‌ కరన్‌ బౌలింగ్‌‌‌‌లో కీపర్‌ శాంసన్‌ కు క్యాచ్‌ ఇచ్చి కేదార్‌ కూడా డగౌట్‌ చేరాడు. దీంతో కెప్టెన్‌ ధోనీ క్రీజులోకి వచ్చాడు. టెవాటియా వేసిన తర్వాతి ఓవర్‌ లో 16 రన్స్‌‌‌‌ రావడంతో చెన్నై విజయ సమీకరణం 30 బాల్స్‌‌‌‌లో 86 రన్స్‌‌‌‌గా మారింది. ఉనాద్కట్‌ వేసిన 17 ఓవర్‌ లో మూడు సిక్సర్లతో చెలరేగిన డుప్లెసిన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ ఓవర్‌ లో 21 రన్స్‌‌‌‌ లభించగా.. 18వ ఓవర్‌ లో 10 పరుగులే వచ్చాయి. దీంతో చెన్నై సమీకరణం 12 బాల్స్‌‌‌‌ 48 రన్స్‌‌‌‌గా మారింది. 19వ ఓవర్‌ లో డుప్లెసిన్‌ ఔట్​ కాగా లాస్ట్‌‌‌‌ ఓవర్‌ లో ధోనీ 3 సిక్సర్లు కొట్టాడు.