
ముంబై: కరోనా కష్టాలను మర్చిపోయేందుకు జనాలు.. ఈసారి ఐపీఎల్‌పై ఎక్కువగా దృష్టిపెట్టినట్లున్నారు. అందుకే లాస్ట్ ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో 28 శాతం వ్యూయర్‌షిప్ పెరిగింది. అరబ్ గడ్డపై ఖాళీ స్టేడియాల్లో జరిగినా.. ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్‌లకు బ్రహ్మరథం పట్టారు. ‘ఫ్యాన్స్‌కు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఈవెంట్‌ను అందించేందుకు ఐపీఎల్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. ఈ లీగ్‌కు ఉన్న గొప్పదనమే అది. లీగ్‌ను సూపర్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్–11 రావడంతో డిజిటల్ ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. ఫ్యాన్స్‌ను రకరకాల కార్యక్రమాలతో ఎంగేజ్ చేసేసింది. వర్చువల్ గెస్ట్ బాక్స్‌తో ఫ్యాన్స్ ఉన్నారనే ఆనందాన్ని కలిగించింది’ అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. తమ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ముంబై, రాజస్తాన్ కూడా డిజిటల్ ప్రోగ్సామ్స్ కండక్ట్ చేశాయి.