ఐపీఎల్ ప్లేఆఫ్స్.. దేవుడి పైనే భారం వేశాం

ఐపీఎల్ ప్లేఆఫ్స్.. దేవుడి పైనే భారం వేశాం

అబుదాబి: ఐపీఎల్ పదమూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్‌‌కు చేరే జట్లపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌‌కు చేరుకున్న ముంబైని మినహాయిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మూడు పొజిషన్‌ల కోసం పోటీ ఏర్పడింది. నాలుగో ప్లేస్‌లో ఉన్న కోల్‌‌కతా నైట్ రైడర్స్ ఆడాల్సిన మ్యాచులు అయిపోయాయి. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌‌తో ఆడిన ఆఖరాటలో కేకేఆర్ 60 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో మిగతా టీమ్స్ గెలుపోటముల మీద ఆ టీమ్ ప్లేఆఫ్స్ చాన్సెస్ ఆధారపడి ఉన్నాయి.

ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్-సన్‌‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచుల రిజల్ట్స్‌‌తో కేకేఆర్ టోర్నీలో ముందుకెళ్తుందా లేదా అనేది తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ విషయంలో తమ టీమ్ చాన్సెస్‌‌పై కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. ఇకపై ఏం జరిగినా అది దేవుడికే వదిలేస్తున్నామని మోర్గాన్ చెప్పాడు. ‘నెట్ రన్ రేట్ గురించి ఆందోళనగా ఉంది. కానీ ముందుగా గెలిచే పొజిషన్‌‌కు మనల్ని మనం తీసుకెళ్లాలి. ఇక ముందు ఏం జరిగినా అది దేవుడికే వదిలేస్తున్నాం’ అని మోర్గాన్ చెప్పాడు.