ఐపీఎల్‌లో తెలుగు కుర్రాళ్లకు ఛాన్స్.. ఎవరిని ఎంతకు కొన్నారంటే..

ఐపీఎల్‌లో తెలుగు కుర్రాళ్లకు ఛాన్స్.. ఎవరిని ఎంతకు కొన్నారంటే..
  • మోరిస్‌కు 16.25 కోట్లు
  • ఎక్కువ రేటు పెట్టి కొన్న రాజస్థాన్
  • జెమీసన్‌కు 15 కోట్లు, మ్యాక్స్​వెల్​కు 14.25 కోట్లు వెచ్చించిన ఆర్సీబీ
  • రూ. 9.25 కోట్లతో కృష్ణప్ప గౌతమ్‌ కొత్త రికార్డు

షార్ట్​ ఫార్మాట్‌‌లో హార్డ్​ హిట్టర్ల కోసం.. ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి..! తమ రాత మారుస్తాడనుకున్న ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించాయి..! గతాన్ని పక్కనబెట్టి.. ఫ్యూచర్‌‌ను పక్కాగా లెక్కలేస్తూ.. ఊహలకు అందని ‘రేట్ల’తో క్రికెటర్లను ఎగరేసుకుపోయాయి..! చిన్నోడా.. పెద్దోడా.. స్వదేశా.. విదేశా.. అనే తేడా లేకుండా సత్తా ఉంటే చాలనే రీతిలో కాసుల వర్షం కురిపించాయి..! ఫలితంగా లక్షలే చాలనుకున్న కుర్ర క్రికెటర్లు సైతం సింగిల్‌‌ నైట్‌‌లో కోట్లకు పడగలెత్తారు..! ఓవరాల్‌‌గా గత 13 సీజన్ల రికార్డులను బ్రేక్‌‌ చేస్తూ… ఈసారి సౌతాఫ్రికా ఆల్‌‌రౌండర్‌‌ క్రిస్‌‌ మోరిస్‌‌ హయ్యెస్ట్‌‌ రేట్‌‌ పలికితే.. పెద్దగా ఆడటం లేదనుకున్న మ్యాక్స్‌‌వెల్‌‌ కూడా మ్యాగ్జిమమ్‌‌ రాబట్టాడు..! ఈ ఇద్దరి మధ్యలో జెమీసన్‌‌ ఊహించని జాక్‌‌పాట్‌‌ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..! స్టార్లు ఉన్నా ఇప్పటివరకు టైటిల్‌‌ నెగ్గని రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు.. డబ్బులను మంచి నీళ్లగా ఖర్చు చేస్తే.. రాజస్తాన్‌‌ సింగిల్‌‌ షాట్‌‌తో ఐపీఎల్‌‌ రికార్డును బ్రేక్‌‌ చేసింది..!!

చెన్నై: ఊహించినట్లుగానే ఐపీఎల్‌‌–2021 ఆక్షన్‌‌ అదిరిపోయింది. బడా కార్పొరేట్ల మధ్య జరిగిన మినీ ‘మనీ వార్‌‌’లో ఆటగాళ్ల తలరాత మారిపోయింది. మొత్తం ఆక్షన్‌‌లో సౌతాఫ్రికా ఆల్‌‌రౌండర్‌‌ క్రిస్‌‌ మోరిస్‌‌ జాక్‌‌పాట్​ కొట్టాడు. రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ అతన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆక్షన్​లో ఎక్కువ ధర పలికిన ప్లేయర్​గా అతను యువరాజ్‌‌ సింగ్‌‌ రికార్డును బ్రేక్‌‌ చేశాడు. 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ రూ. 16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్‌‌ మొత్తంలో ఖరీదైన ప్లేయర్‌‌ అయిన విరాట్‌‌ కోహ్లీ (రూ. 17 కోట్లు)ని ఎవరూ బ్రేక్‌‌ చేయకపోవడం విశేషం. జస్ట్‌‌ రూ. 75 లక్షల బేస్‌‌ప్రైస్‌‌తో వేలంలోకి వచ్చిన మోరిస్‌‌ కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఎక్కువగా ముంబై, రాజస్తాన్‌‌, పంజాబ్‌‌ మధ్య త్రిముఖ పోటీ సాగింది. చివరకు రాజస్తాన్‌‌ అతిపెద్ద సాహసం చేసింది. ఐపీఎల్‌‌లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌‌లు ఆడిన మోరిస్‌‌.. 23.95 యావరేజ్‌‌తో 551 రన్స్‌‌ చేశాడు. 23.98 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు. తమ టీమ్‌‌లో బ్యాలెన్స్‌‌ కోసం మోరిస్‌‌ను తీసుకున్నామని రాజస్తాన్​ ఫ్రాంచైజీ సీఈవో జేక్‌‌ లుచ్‌‌ మెకరమ్‌‌ తెలిపాడు.  మొత్తం ఫ్రాంచైజీ స్క్వాడ్‌‌ 25 మంది కాగా, అందులో 8  మంది ఫారిన్‌‌ ప్లేయర్లు ఉండాలి. ప్రస్తుతం రాజస్తాన్‌‌ వద్ద 24, రాయల్‌‌ చాలెంజర్స్‌‌ వద్ద 22 మంది ఉండగా, మిగతా అన్ని టీమ్‌‌ల్లో 25 మంది ఉన్నారు.

జెమీసన్‌‌ అదుర్స్‌‌.. మ్యాక్సీ జోరు

టీమ్‌‌లో చాలా మంది స్టార్లు ఉన్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు ఈసారి ఆల్‌‌రౌండర్లపై దృష్టిపెట్టింది. దీంతో కివీస్‌‌ ప్లేయర్‌‌ కైల్‌‌ జెమీసన్‌‌ను రూ. 15 కోట్లకు తీసుకుని ఇతర ఫ్రాంచైజీలకు షాకిచ్చింది. లాస్ట్‌‌ సీజన్‌‌లో ఘోరంగా ఫెయిలైన మ్యాక్స్‌‌వెల్‌‌పై కూడా ఆర్‌‌సీబీ చాలా నమ్మకం పెట్టుకుంది. తనదైన రోజున మ్యాచ్‌‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న అతని కోసం బెంగళూరు రూ. 14.25 కోట్లు వెచ్చించింది. సీఎస్​కే కూడా గ్లెన్‌‌ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. టు వే వార్‌‌గా నడిచిన బిడ్‌‌లో ఆర్‌‌సీబీ గెలిచింది. గత వేలంలో పంజాబ్‌‌ రూ. 10.75 కోట్లకు మ్యాక్స్‌‌వెల్‌‌ను కొనుగోలు చేసింది. కానీ యూఏఈ లీగ్‌‌లో 13 మ్యాచ్‌‌లు ఆడిన ఆస్ట్రేలియన్‌‌ కేవలం 108 రన్స్‌‌ మాత్రమే చేశాడు. దీంతో అతన్ని పంజాబ్‌‌ వదులుకుంది. ఇప్పటివరకు 82 మ్యాచ్‌‌ల్లో 1505 రన్స్‌‌ చేశాడు.

రిచర్డ్‌‌సన్‌‌ రిచ్‌‌.. షారూక్​ ఖాన్​ జాక్​పాట్​

ఈసారి ఎక్కువగా బౌలర్లపై గురిపెట్టిన పంజాబ్‌‌.. జే రిచర్డ్‌‌సన్‌‌ కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుంచి అనూహ్యంగా పోటీ వచ్చినా పంజాబ్‌‌ చివరి వరకు రేస్‌‌లో నిలబడింది. మ్యాక్స్‌‌వెల్‌‌ను వదులుకోవడంతో ఆ ప్లేస్‌‌ను రిచర్డ్‌‌సన్‌‌తో భర్తీ చేయాలని పంజాబ్‌‌ భావించింది. దీంతో పాటు అన్‌‌క్యాప్‌‌డ్‌‌ ప్లేయర్‌‌ రిలే మెరెడిత్‌‌ కోసం కూడా పంజాబ్‌‌ భారీ మొత్తం వెచ్చించింది. ఇప్పటివరకు ఆసీస్‌‌ నేషనల్‌‌ టీమ్‌‌కు ఆడని అతన్ని రూ. 8 కోట్లకు దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇండియా డొమెస్టిక్‌‌ ప్లేయర్‌‌ షారూక్‌‌ ఖాన్‌‌ను రూ. 5 కోట్ల 25 లక్షలకు తీసుకుని సరికొత్త స్ట్రాటజీలకు తెర తీసింది.

పాపం.. స్మిత్‌‌

ఆస్ట్రేలియా కెప్టెన్‌‌గా అద్బుతమైన పేరు తెచ్చుకున్న స్టీవ్‌‌ స్మిత్‌‌కు ఈసారి వేలం కలిసి రాలేదు. రాజస్తాన్​వదిలేసుకోవడంతో రూ. 2 కోట్ల బేస్‌‌ప్రైస్‌‌తో ఆక్షన్‌‌లోకి వచ్చిన అతనిపై ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కరుణ చూపింది. అది కూడా రూ. 20 లక్షలు మాత్రమే ఎక్కువగా ఇచ్చింది. మిగతా ఫ్రాంచైజీలు కనీసం స్మిత్‌‌ వైపు చూడకపోవడం ఆలోచించాల్సిన విషయం. మరి ఈ మాజీ కెప్టెన్‌‌తో రికీ పాంటింగ్‌‌ ఏం చేస్తాడో చూడాలి. ఆల్‌‌రౌండర్‌‌ టామ్‌‌ కరన్​కోసం ఇదే ఢిల్లీ.. రూ. 5.25 కోట్లు వెచ్చించడం విశేషం.

కోల్‌‌కతాకు భజ్జీ.. ముంబైకి సచిన్​ కొడుకు

సీఎస్‌‌కే వదిలేసిన హర్భజన్‌‌ను రూ. 2 కోట్లకు కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ తీసుకుంది. ఫస్ట్‌‌ అన్‌‌సోల్డ్‌‌గా మిగిలిపోగా.. లాస్ట్‌‌లో అతనిపై కేకేఆర్‌‌ దయ చూపెట్టింది. రెండేళ్ల తర్వాత బరిలోకి దిగుతున్న బంగ్లాదేశ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ షకీబ్‌‌ను రూ. 3.20 కోట్లకు నైట్‌‌రైడర్స్‌‌ దక్కించుకుంది. కూల్టర్‌‌నైల్‌‌ కోసం రూ. 5 కోట్లు వెచ్చించిన ముంబై.. మిల్నే, పీయూష్‌‌ చావ్లాపై భారీగానే ఖర్చు చేసింది. అలాగే, అర్జున్‌‌ టెండూల్కర్‌‌ను రూ. 20 లక్షలకు తీసుకుంది.

కేదార్​కు రైజర్స్​ బాసట

ఈసారి వేలంలో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ పెద్దగా రైజ్‌‌ కాలేదు. మూడు ఖాళీలను భర్తీ చేసుకున్న ఆ టీమ్​ వద్ద మనీ పర్స్‌‌ భారీగానే ఉన్నా స్టార్ల కోసం పోటీపడలేదు. ఎవరూ ఆసక్తి చూపని కేదార్‌‌ జాదవ్‌‌ను రూ. 2 కోట్లకు తీసుకుంది. ముజీబ్‌‌ జద్రాన్‌‌ కోసం కోటిన్నర ఖర్చు పెట్టింది.

సీఎస్‌‌కే సాహసం..

లాస్ట్‌‌ సీజన్‌‌ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ అతిపెద్ద సాహసం చేసింది. చిన్న ప్లేయర్ల కోసం భారీ మొత్తంలో వెచ్చించింది. 2019లో రాజస్తాన్‌‌కు ఆడిన స్పిన్నర్‌‌ కృష్ణప్ప గౌతమ్‌‌ను సీఎస్‌‌కే రూ. 9 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల బేస్‌‌ప్రైస్‌‌తో వచ్చిన అతని కోసం ఇతర ఫ్రాంచైజీలు పోటీపడటంతో రేట్‌‌ పెరిగినా చెన్నై వెనక్కి తగ్గలేదు. దీంతో టీమిండియా ప్లేయర్‌‌ కాకుండానే అత్యధిక రేట్‌‌ పలికిన క్రికెటర్​గా గౌతమ్‌‌ రికార్డులకెక్కాడు. గతంలో క్రునాల్‌‌ పాండ్యాను ముంబై రూ. 8.8 కోట్లకు తీసుకుంది. ఇక ఇంగ్లండ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ మొయిన్‌‌ అలీ కోసం కూడా సీఎస్‌‌కే రూ. 7 కోట్లు వెచ్చించింది. ఏడేళ్ల తర్వాత పుజారాకు చెన్నై చాన్స్‌‌ ఇచ్చింది. బేస్‌‌ ప్రైస్‌‌ రూ. 50 లక్షలకు అతన్ని తీసుకుంది. మరో ముగ్గురు డొమెస్టిక్‌‌ కుర్రాళ్లను ఎంచుకుంది.

వీళ్లకు నో చాన్స్​

ఆక్షన్​లో పలువురు పేరున్న ప్లేయర్లను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇండియా నుంచి హనుమ విహారి, వరుణ్‌ ఆరోన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌ అన్​సోల్డ్​గా మిగిలారు. ఫారిన్​ కోటాలో అంచనాలున్న ఆసీస్​ వన్డే, టీ20 కెప్టెన్​ ఆరోన్​  ఫించ్‌పై ఎవ్వరూ ఆసక్తి చూలేదు. జేసన్‌ రాయ్‌, హేల్స్‌, క్యారీ, గప్టిల్‌, షాన్‌ మార్ష్‌ తదితరులు అన్​సోల్డ్​గా మిగిలారు.

For More News..

రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న లాయర్లు..

కరోనా టైమ్​లో ఎడ్యుకేషన్​ లోన్స్​ రికార్డు