V6 News

సందడి చేయనున్న రెహ్మాన్, రణ్ వీర్ సింగ్

సందడి చేయనున్న రెహ్మాన్, రణ్ వీర్ సింగ్

IPL 2022 ముగింపు వేడుకలకు సమయం దగ్గర పడుతోంది. 2022, మే 29వ తేదీ ఆదివారం అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ ముగిస్తే.. ఐపీఎల్ 2022 సీజన్ కు ఎండ్ కార్డు పడనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. ఈ గెలుపు ద్వారా.. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ కు ఘనమైన నివాళి అర్పించాలని అనుకొంటోంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా.. 45 నిమిషాల పాటు కార్యక్రమం జరుగనుంది. ఇందుకు బీసీసీఐ (BCCI) సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్, బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ లు హాజరు కానున్నారు. వీరు ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరితో పాటు.. ఝార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. పది మంది సభ్యుల ఝార్ఖండ్ ఛౌ డ్యాన్స్ బృందాన్ని ఖరారు చేసినట్లు టాక్. బీసీసీఐ అధ్యక్షులు గంగూలీ, కార్యదర్శి జైషాతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఐపీఎల్ (IPL) విషయానికి వస్తే 2008లో ప్రారంభమైంది. తొలి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇతని సారథ్యంలోనే తొలి కప్పు సాధించింది. 

మరిన్ని వార్తల కోసం  :-

ఐపీఎల్ ఆడలేదా..ఏం పర్వాలేదు..ఏపీఎల్ ఉందిగా..


బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్