ఐపీఎల్ ఆడలేదా..ఏం పర్వాలేదు..ఏపీఎల్ ఉందిగా..

ఐపీఎల్ ఆడలేదా..ఏం పర్వాలేదు..ఏపీఎల్ ఉందిగా..

ఐపీఎల్లో ఆడని తెలుగు క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ తరహాలో త్వరలో ఏపీఎల్ నిర్వహించనుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీకి బీసీసీఐ ఆమోదం తెలిపింది. వైజాగ్లోని ఏసీఏ-వీసీఏ స్టేడియంలో ఏపీఎల్ జరగనుంది.  ఈ విషయాన్ని  ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ సభ్యులు వెల్లడించారు. 

ఎప్పటి నుంచి మొదలు

ఏపీఎల్ జూన్ 22 నుంచి మొదలుకానుంది. ఈ లీగ్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐపీఎల్ స్థాయిలో ఏపీఎల్ నిర్వహిస్తామని ఏసీఏ అధికారులు తెలిపారు. క్రికెట్ అభిమానులకు అసలైన టీ-20 విందును అందిస్తామని వెల్లడించారు. 

మెన్స్ , ఉమెన్స్ లీగ్..

ఏపీఎల్ మెన్స్ లీగ్ తో పాటు..ఉమెన్స్ లీగ్ కూడా జరగనుంది. పురుషుల మ్యాచ్‌లు జూన్ 22 నుంచి జూలై 3 వరకు జరగనుండగా..మహిళల మ్యాచ్‌లు జూన్ 28 నుంచి జూలై 3 వరకు నిర్వహిస్తారు. మెన్స్ మ్యాచ్‌లు విశాఖ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. ఉమెన్స్ మ్యాచులకు వేదిక ఇంకా ఖరారు కాలేదు. కాగా ఏపీఎల్ లీగ్ అనౌన్స్ మెంట్ తో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు తెగ సంతోషపడుతున్నారు. ఏపీఎల్ ద్వారా తమ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎల్లో రాణించి..  టీమిండియాకు ఎంపికవ్వాలని కలలు కంటున్నారు.

మరిన్ని వార్తల కోసం

విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం