
ముంబై: ఐపీఎల్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న ఆర్‌సీబీ కీపర్ దినేశ్ కార్తీక్ తన ఆటతో లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ను కూడా ఆకట్టుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న కార్తీక్.. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా టీమ్‌లో ఫినిషర్‌గా పనికొస్తాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఇండియా టీమ్‌లో ఉండాలని కార్తీక్ కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని వయసు ఎంత అని చూడొద్దు. గ్రౌండ్‌లో తనేం చేస్తున్నాడన్నదే గుర్తించాలి. ఎందుకంటే తన ఆటతో అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. టీమ్ కోసం ఆడుతున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇండియా టీమ్‌లో ఆరు లేదా ఏడో నంబర్‌లో వచ్చే బ్యాటర్ చేయాల్సిన పనినే తనిప్పుడు చేస్తున్నాడు’ అని సన్నీ పేర్కొన్నాడు.