గుజరాత్ ఓపెనర్ల ధనాధన్ బ్యాటింగ్.. అయోమయంలో ధోని 

గుజరాత్ ఓపెనర్ల ధనాధన్ బ్యాటింగ్.. అయోమయంలో ధోని 

సొంత గడ్డపై గుజరాత్ బ్యాటర్లు జోరు కనబరుస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు గుజరాత్ ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. సాహా, గిల్ పోటీపోటీగా బౌండరీలు బాదుతున్నారు. వీరిద్దరి ధాటికి గుజరాత్.. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్(36), వృద్ధిమాన్ సాహా(26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి రెండు ఓవర్లు చెన్నై బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేశారు. దీంతో ఒక్క బౌండ‌రీ కూడా రాలేదు. అనంతరం గేర్ మార్చిన సాహా.. దీప‌క్ చాహ‌ర్ వేసిన మూడో ఓవ‌ర్‌లో ఒక సిక్స్, రెండు బౌండ‌రీలు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. ఆపై నాలుగో ఓవ‌ర్‌లో గిల్.. మూడు వరుస బౌండరీలు బాధి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అనంతరం తీక్షన్ వేసిన ఆరో ఓవ‌ర్‌లో కూడా గిల్.. హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. గుజరాత్ జోరు చూస్తుంటే భారీ స్కోర్ చేయడం ఖాయమనిస్తోంది.