IPL 2024 Final: చేతులెత్తేసిన టాపార్డర్.. పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్

IPL 2024 Final: చేతులెత్తేసిన టాపార్డర్.. పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్

లీగ్ దశలో పరుగుల వరద పారించిన హైదరాబాద్ టాపార్డర్ తుది పోరులో చేతులెత్తేశారు. కోల్‌కతా పేసర్లను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ 2 పరుగులకే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్  ట్రావిస్ హెడ్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆపై కొద్దిసేపటికే రాహుల్ త్రిపాఠీ (9) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆరంజ్ ఆర్మీ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు హైదరాబాద్ ను స్టార్క్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. కళ్లు చెదిరే బంతితో అభిషేక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 2 పరుగులకే సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా వేసిన ఆ మరుసటి ఓవర్‌లోట్రావిస్ హెడ్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో ఆదుకోవాల్సిన రాహుల్ త్రిపాఠి (9) కూడా వారి వెంటే అడుగులు వేశాడు. స్టార్క్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం నితీశ్‌ రెడ్డి (1), మార్‌క్రమ్ (6) క్రీజులో ఉన్నారు.