IPL 2024: కోల్ కతాతో సన్ రైజర్స్ తొలి ఫైట్.. బలాబలాలు.. రికార్డులు ఇవే!

IPL 2024:  కోల్ కతాతో సన్ రైజర్స్ తొలి ఫైట్..  బలాబలాలు.. రికార్డులు ఇవే!

ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఫైట్ కు సిద్ధమైంది.  శనివారం జరగనున్న రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. ఈరోజు రాత్రి 8.30గంటలకు  కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇరుజట్లు తలపడనున్నాయి. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. ఇక, గాయం కారణంగా గత సీజన్ కు దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడం కోల్ కతాకు కలిసేచ్చే అంశం. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో కోలకత్తా బౌలింగ్ పటిష్టంగా మారినుంది.  వరల్డ్ బెస్ట్ బౌలర్లు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచిన మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

గత కొన్ని సీజన్లుగా మెరుగైన ఆట తీరును కనబర్చినా అదృష్టం కలిసి రాక అభిమానులను నిరాశపరుస్తూ వస్తున్న  హైదరాబాద్..  ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. జట్టులో ట్రావిస్ హెడ్‌, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మార్కమ్‌లతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగానే ఉంది. పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్,  జయదేవ్ ఉనద్కత్ లతో కూడిన బౌలింగ్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

ఇక, కేకేఆర్ లోనూ బిగ్ హిట్టర్లు ఉన్నారు. యంగ్ ప్లేయర్ రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్,  ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణాలు తమ బ్యాటింగ్ తో విధ్యంసం సృష్టించగలరు. వీరు చెలరేగితో  ప్రత్యర్థి జట్టుకు చుక్కలే.  స్పిన్ ద్వయం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తితోపాటు ఫాస్ట్ బౌలర్ స్టార్క్, హర్షిత్ రాణా వంటి బౌలర్లతో కోల్ కతా బలంగానే ఉంది. ఈక్రమంలో హైదరాబాద్-కోల్ కతా జట్ల మధ్య హోరాహోరి ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.

ఇరుజట్ల రికార్డుల విషయానికి వస్తే..  ఐపీఎల్‌లో కేకేఆర్ పై ఎస్‌ఆర్‌హెచ్‌దే  పైచేయి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో SRH 25 మ్యాచ్ లలో 16 గెలవగా... KKR 9 మ్యాచ్‌లల్లో విజయం సాధించింది.

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ/మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్,

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, ఫిల్ సాల్ట్ (WK), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.