KKR vs RR: రాజస్థాన్ vs కోల్‌కతా.. టేబుల్ టాపర్ ఎవరు?

KKR vs RR: రాజస్థాన్ vs కోల్‌కతా.. టేబుల్ టాపర్ ఎవరు?

ఐపీఎల్ లో నేడు అసలైన సమరం జరగనుంది. రెండు టాప్ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండు బలమైన జట్లు పోటీ పడుతుండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. 

రాజస్థాన్ రాయల్స్ :

టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ సూపర్ జోష్ లో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో 5 గెలిచి టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో తప్పితే మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించింది. వేదిక ఏదైనా విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. బ్యాటింగ్ లో సంజు శాంసన్, రియాన్ పరాగ్ సూపర్ ఫామ్ లో ఉండగా.. హెట్ మేయర్ లోయర్ ఆర్డర్ లో అదరగొడుతున్నాడు. బట్లర్ ఆర్సీబీపై  ఒక సెంచరీ మినహా మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. జైస్వాల్ గాడిలో పడితే రాజస్థాన్ కు మరో విజయం గ్యారంటీ. బౌలింగ్ లో జట్టు సమిష్టిగా రాణిస్తుంది. ముఖ్యంగా బోల్ట్, చాహల్ ప్రత్యర్థిపై చెలరేగి ఆడుతున్నారు. వీరికి తోడు అశ్విన్, ఆవేశ ఖాన్ చక్కని సహకారం అందిస్తున్నారు. 

కోల్ కతా నైట్ రైడర్స్:

కేకేఆర్ ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఒకరిద్దరి ప్లేయర్లపై వీరు ఆధారపడరు. బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉండడం వీరికి కలిసి వచ్చే అంశం. పిల్ సాల్ట్, నరైన్ ఓపెనర్లుగా అదరగొడుతున్నారు. అయ్యర్ పూర్తి ఫామ్ లో రాకపోయినా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. లోయర్ ఆర్డర్ లో రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్, రస్సెల్ మెరుపులు మెరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్ లో స్పిన్నర్లు నరైన్, వరుణ్ చక్రవర్తి కేకేఆర్ కు పెద్ద బలం. స్టార్క్ ఫామ్ లోకి రావడం.. హర్షిత్ రానా కోలుకోవడంతో ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. 

బలాబలాలను పరిశీలిస్తే ఇరు జట్లు సమంగానే కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేకేఆర్ కు 55 శాతం గెలిచే ఛాన్స్ లు ఉంటే.. రాజస్థాన్ కు 45 శాతం గెలిచే అవకాశం ఉంది. రెండు జట్ల మధ్య చివరి 5 మ్యాచ్ లు చూసుకుంటే రాజస్థాన్ 3, కేకేఆర్ 2 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి. ఇప్పటివరకు మరి ఎవరు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలుస్తారో చూడాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు (అంచనా) 

ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు (అంచనా) 

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (C & WK), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బర్గర్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్