GT vs RCB మధ్య ఫైనల్ ఫైట్.. గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయి తెలుసా?

GT vs RCB మధ్య ఫైనల్ ఫైట్.. గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయి తెలుసా?

IPL 2026 Final: ఐపీఎల్ 2026 చివరి అంకానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో గెలిచి ట్రోఫీని అందుకునే విజేతతో పాటు రన్నరప్‌కు దక్కే ప్రైజ్ మనీ, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు బీసీసీఐ భారీ నగదు బహుమతులు ఇవ్వనుంది. 

కోట్లాది రూపాయల కాసుల వేట: 
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపుకు వచ్చేసింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడబోతున్నాయి. ఈ రెండు టీమ్స్ ఖాతాలోనూ ప్రస్తుతం తలో ఒక్క ట్రోఫీ మాత్రమే సాధించాయి. ఇప్పుడు రెండో ట్రోఫీని దక్కించుకునేందుకు ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు 3 సార్లు తలపడగా, 2–1 అధిక్యంలో ఆర్సీబీ నిలిచింది.  

విజేతకు రూ.20 కోట్లు.. రన్నరప్‌కు మాత్రం:
ఐపీఎల్ 2026 విజేతగా నిలిచే జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.20 కోట్ల నగదుని అందించనుంది. ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే టీమ్ కి రూ.13 కోట్లు ఇవ్వనుంది. టోర్నీలో థర్డ్ ప్లేస్ లో నిలిచిన జట్లకు కూడా బీసీసీఐ భారీగానే అందిస్తోంది. క్వాలిఫైయర్ 2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ.7 కోట్లు ఇవ్వనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో వెనుతిరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. 

ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్.. పర్పుల్ క్యాప్ కోసం సీనియర్స్:  
ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసు అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి ప్రస్తుతానికి నెంబర్ స్థానంలో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710 పరుగులు) అతడికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఫైనల్ ముగిసేసరికి ఎవరి వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంటుందో వారికి రూ.10 లక్షల నగదు లభించనుంది. 

ఇక ఐపీఎల్ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసుకుని పర్పుల్ క్యాప్ కోసం సీనియర్ బౌలర్లు తెగ పోటీ పడుతున్నారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ 16 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆర్‌సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఇద్దరిలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న బౌలర్‌కు రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.  

మోస్ట్ వాల్యుబుల్, ఎమర్జింగ్ ప్లేయర్స్ ఎవరో: 
ఈ సంవత్సరం ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రేసులో వైభవ్ సూర్యవంశీతో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య ముందంజలో ఉన్నారు. ఈ అవార్డు సాధించిన ప్లేయర్ కి బీసీసీఐ రూ.20 లక్షలు ఇస్తుంది. అలాగే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేసులో వైభవ్ సూర్యవంశీ, కగిసో రబాడ, జోఫ్రా ఆర్చర్ మధ్య తీవ్రంగా పోటీ నడుస్తుంది. ఈ అవార్డు దక్కించుకున్న వారికి రూ.10 లక్షలు అందుకుంటారు. క్రమశిక్షణతో ఆడిన జట్టుకు ఇచ్చే ఫెయిర్‌ప్లే అవార్డు రేసులో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ అవార్డు కింద సదరు జట్టుకు రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. మొత్తంమీద బీసీసీఐ ఈ సీజన్ అవార్డుల కోసం ఏకంగా రూ.47.1 కోట్లు ఖర్చు పెడుతుంది.  

ఐపీఎల్ ప్రైజ్ మనీ ఫుల్ డీటెయిల్స్: 
* విజేత జట్టుకు రూ. 20 కోట్లు
* రన్నరప్ కి రూ. 13 కోట్లు
* క్వాలిఫైయర్ 2లో ఓడిన రాజస్థాన్ కి రూ. 7 కోట్లు
* ఎలిమినేటర్‌లో ఓడిన హైదరాబాద్ కి రూ. 6.5 కోట్లు
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రూ. 20 లక్షలు
* ఆరెంజ్ క్యాప్ విజేత రూ. 10 లక్షలు
* పర్పుల్ క్యాప్ విజేత రూ. 10 లక్షలు
* మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రూ. 10 లక్షలు
* ఫెయిర్‌ప్లే విజేత జట్టురూ. 10 లక్షలు

ఐపీఎల్ ప్రైజ్ మనీ జర్సీ ఇదే: 
2008లో ఐపీఎల్ ప్రారంభమైన మొదటి రెండు సీజన్లలో విజేతకు రూ.4.8 కోట్లు మాత్రమే అందించేవారు. 2010 నుంచి ఆ మొత్తాన్ని రూ.10 కోట్లకు పెంచేశారు. అనంతరం 2014, 2015లో రూ.15 కోట్లుగా ఉన్న ప్రైజ్ మనీని 2016లో రూ.20 కోట్లకు పెంచారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, 2020లో మళ్లీ రూ.15 కోట్లకు తగ్గించగా, 2021 నుంచి ఇప్పటి వరకు విజేతకు నిలిచిన జట్టుకి రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని బీసీసీఐ అందజేస్తుంది.