ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే
  • ఐపీఎల్ వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్ విడుదల

ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్ విడుదలయింది. ఈ వేలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ రూ. 20 లక్షల కనీస ధరకు రిజర్వ్ అయ్యాడు. ఈసారి వేలంలో 292 మంది ఆటగాళ్లు వేలంలో నిలిచారు. ఈ వేలంపాట ఫిబ్రవరి 18, 2021న చెన్నైలో జరగనుంది. వేలంపాటలో పాల్గొనడానికి 1114 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఐపీఎల్‌లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను సమర్పించిన తరువాత నిర్వాహకులు తుది జాబితాను ప్రకటించారు. ఈ వేలంలో మొత్తం 164 మంది భారతీయ ఆటగాళ్ళు, 125 మంది విదేశీ ఆటగాళ్ళు మరియు అసోసియేట్ దేశాల నుంచి ముగ్గురు ఆటగాళ్ళు పాల్గొననున్నారు.

ఈసారి జరిగే వేలంలో రూ. 2 కోట్ల అత్యధిక రిజర్వ్ ధరను ఇద్దరు భారతీయ ఆటగాళ్ళు హర్భజన్ సింగ్ మరియు కేదార్ జాదవ్ దక్కించుకున్నారు. అదేవిధంగా ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ళు కూడా రిజర్వ్ ధరకు కేటాయించబడ్డారు. వారిలో గ్లెన్ మాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మరియు మార్క్ వుడ్ ఉన్నారు. ఇదేవిధంగా మరో 12 మంది ఆటగాళ్లు రూ. 1.5 కోట్ల రిజర్వ్ ధరను దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన హనుమ విహారీ, ఉమేష్ యాదవ్‌లు కోటి రూపాయల రిజర్వ్ ధరను దక్కించుకున్నారు.

కాగా.. లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ వేలంలో కేవలం రూ. 20 లక్షల రిజర్వ్ ధరను దక్కించుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. అర్జున్ ఈ మధ్య జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో విజయ్ హజారే ట్రోఫికి కూడా ఎంపిక కాలేదు. మరి ఈ ఐపీఎల్ వేలంలో అర్జున్ ఏ ఫ్రాంజైజీ దక్కించుకుంటుందో చూడాలి.

For More News..

లైంగిక దాడి కేసులో యువకుడికి పదేళ్ల జైలు

284 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

వూహాన్ ల్యాబ్ నుంచి కాదు.. ఆస్ట్రేలియా బీఫ్‌‌‌‌‌‌‌‌ నుంచే కరోనా!